నాగార్జున రీసెంట్ గా అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమా సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. 20 ఏళ్ళ తర్వాత తన మేనకోడలు సుప్రియ మళ్ళీ గూఢచారి సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వడంతో.. నాగార్జున గూఢచారి విజయాన్ని మరింతగా ప్రమోట్ చేస్తున్నాడు. మరి అదే లెవల్లో అంటే నాగార్జున మేనల్లుడు సుశాంత్ నటించిన చి.ల.సౌ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అందునా ఆ సినిమా అన్నపూర్ణ బ్యానర్ నుండే విడుదలయ్యింది. మరి చి.ల.సౌ విడుదలకు ముందు కేవలం ఒక ప్రెస్ మీట్ కి హాజరైన నాగార్జున సినిమా విడుదల తర్వాత ఇక చి. ల.సౌ గురించి మాట్లాడింది లేదు. ఇక గూఢచారి సినిమా విషయానికి వస్తే సినిమా విడుదలకు ముందు నాగార్జున, సుప్రియను అంటే గూఢచారి సినిమాలో ఒక కీ రోల్ లో నటించిన ఆమె గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సినిమా విడుదల తర్వాత గూఢచారి హిట్ అవడంతో విషెస్ తెలపడం మాత్రమే కాదు ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి కూడా హాజరయ్యాడు.
ఇక గూఢచారి సినిమా గురించి మాట్లాడిన నాగార్జున.. ఈ ఏడాది హిట్ అయిన సినిమాల్లో గూఢచారి సినిమా మూడోది అని చెప్పడం కొద్దిగా ఆశ్చర్యకర విషయమే. అడివి శేష్ నటించిన గూఢచారి సినిమా చూస్తుంన్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని.. ఈ ఏడాది రంగస్థలం, మహానటి హిట్ తర్వాత గూఢచారి సినిమా హిట్ అని నాగార్జున గూఢచారి సినిమా బృందాన్ని అభినందించాడు. మరి ఈ ఏడాది హిట్ అయిన సినిమాల్లో కేవలం రంగస్థలం, మహానటి, గూఢచారి అని చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన తొలిప్రేమ హిట్. అలాగే మహేష్ బాబు భరత్ అనే నేను కూడా హిట్టే. మరి నాగార్జునకు ఆ సినిమాలేవి కనబడలేదా.. లేదంటే ఆ సినిమాలు నాగ్ చూడలేదా అనే డౌట్ క్రియేట్ అవుతుంది. మరి నాగార్జున కేవలం ఈ మూడు సినిమాలే హిట్ అనడం మాత్రం కొద్దిగా ఆశ్చర్యంతో కూడిన షాక్ వంటిదే.
ఇకపోతే గూఢచారి సినిమా చాలా బావుందని.. ఈ సినిమా హిట్ అని.. అయినా హిట్ సినిమాకి డబ్బులు రావడం ముఖ్యం కాదని నలుగురు మెచ్చేలా ఉంటే ఆ సినిమా హిట్టే అని.. గూఢచారి సినిమాలో నటించిన అడివి శేష్ నటనను, సుప్రియను, ఈ సినిమా దర్శకుడిని నాగార్జున పొగిడేశాడు. మరి మేనకోడలును హైలెట్ చేస్తూ... మేనల్లుడిని వదిలేశాడా నాగ్.. అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.