Advertisement
Google Ads BL

హిట్టు టాక్ వచ్చినా ఏం లాభం..?


వారానికి అరడజను చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్దకు రావడం.. అందులో కొన్ని సినిమాల్లో సరైన కంటెంట్ లేక ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు. ఎక్కడో చిన్న చితక సినిమా హిట్ అయినా ఆ సినిమా కి కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఒక సినిమాని హిట్ అని ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా ఓవరాల్ గా మంచి మార్కులు వేసినా సినిమా కలెక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం తుస్ మంటున్నాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ సుశాంత్ నటించిన చి.ల.సౌ సినిమానే. ఆ సినిమాకి అక్కినేని కాంపౌండ్ బ్యాగ్రౌండ్ ఉంది.. అలాగే సినిమా విడుదలయ్యాక పాజిటివ్ అంటే హిట్ టాక్ వచ్చింది. అలాగే విమర్శకులు సైతం సినిమాని మంచిగుందన్నారు. కానీ.. చివరికి మిగిలింది ఏమిటి?

Advertisement
CJ Advs

అయితే ఇలా కేవలం చి. ల.సౌ సినిమా విషయంలోనే జరగలేదు. ఇలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన బోలెడన్ని చిన్న సినిమాలు హిట్ టాక్ వచ్చి హిట్ అయినా.. కలెక్షన్స్ నిల్. అలా అయిన వాటిలో.. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, అలాగే లేటెస్ట్ గా సుధీర్ బాబు సమ్మోహనం సినిమా. మరి ఈ సినిమాలన్నిటికీ క్రిటిక్స్, ప్రేక్షకులు కూడా పాజిటివ్ మార్కులు వేసినా సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమాలకు ఇలా కలెక్షన్స్ తక్కువ రావడానికి కారణం ఏదో ఉంది.

ఆ ఏదో అనేది ప్రమోషన్స్ అనే టాక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో జోరుగా వినబడుతుంది. స్మమోహనం సినిమాకి సుధీర్ బాబు బావ మహేష్ వంటి వారు సమ్మోహనం సినిమా  విడుదలకు ముందు... అయ్యాక కూడా మీడియా ప్రమోషన్స్ లోను, అలాగే ఆన్ లైన్ ప్రమోషన్స్ లోను జోరు చూపించిన సుధీర్ బాబు - ఇంద్రగంటికి ఒరిగింది లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీ హ్యాండ్ వేసినా చి. ల.సౌ పరిస్థితి అంతే. అయితే ఇలా చిన్న సినిమాలు హిట్ అయినా కలెక్షన్స్ రాకపోవడానికి వాటికి సరైన ప్రమోషన్స్ లేవనే టాక్ వినబడుతూనే ఉంది. ఎంతగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా సినిమాలకు హైప్ రాదని.. బి.సి సెంటర్స్ ని ఆకట్టుకోవాలంటే... కాలేజ్ లకి అలాగే పలు ఊర్లలో థియేటర్స్ కి వెళ్లి సినిమా టీమ్ మొత్తం ప్రమోట్ చేస్తే ఇలాంటి సినిమాలకు కేవలం హిట్ ఆదరణే కాదు.. కలెక్షన్స్ ఆదరణ కూడా దక్కుతుందనే భావన కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్నారు.

No Promotions for Chi La Sow in B, C Centers:

Promotions Weak for Chi La Sow 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs