Advertisement
Google Ads BL

ఔరా.. యోగాసనాలతో అదరగొడుతోంది!


భారతదేశంలో పుట్టిన యోగా గొప్పతనం గురించి ఇప్పుడు అన్ని దేశాలు తెలుసుకుంటూ యోగాను ఫాలో అవుతున్నాయి. పాశ్చాత్యదేశాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా యోగా గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కానీ ఇండియాలో మాత్రం ఇది కేవలం సెలబ్రిటీలనే తప్ప సామాన్యులను ఇంకా ప్రభావితం చేయడం లేదు. ఇక సినిమా ఫీల్డ్‌లో మరీ ముఖ్యంగా నటీమణులు ఈ మధ్య యోగాను బాగా ఫాలో అవుతూ.. భం చిక్‌... భంచిక్‌.. చేయి యోగా.. వంటికి యోగా మంచిదేగా అంటూ పాటలు పాడుకుంటున్నారు. స్వీటీ అనుష్క, భూమిక నుంచి ఇలాంటి యోగాలో ప్రావీణ్యం పొందిన వారు ఎందరో ఉన్నారు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే యోగా అంటే మనకు రాందేవ్‌బాబా జ్ఞాపకం వస్తాడు. కానీ బాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలకు యోగాను నేర్పించే గురువు దీపికా మెహతా. ఈమె ఆసనాలు వేయడం చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. యోగా పేరు వింటేనే ఇప్పుడు దీపికా మెహతా గుర్తుకు వస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా తన ఆసనాలతో సోషల్‌మీడియాలో కూడా వేలాది మంది ఫాలోయర్స్‌ని సంపాదించుకుంది. కత్రినా కైఫ్‌, ప్రియాంకాచోప్రా, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ వంటి ఎందరికో ఈమె యోగాను నేర్పిస్తున్నారు. 

ఇక దీపికా మెహతా వేసే ఆసనాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూస్తే ఎంతటి వారైనా స్ఫూర్తిపొంది వెంటనే తాము కూడా ఫిట్నెస్‌గా ఉండేందుకు యోగా నేర్చుకోవాలనే కోరిక కలగడం ఖచ్చితం. ఈమెని సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతుంటారు. అలియాభట్‌, మలైకా అరోరా, కరీనా కపూర్‌ వంటి వారు కూడా ఈమెని ఫాలో అవుతూ ఫిట్‌నెస్‌ని పొందుతుండటం విశేషం.

Yoga Trainer Deepika Mehta Yoga Poses Goes Viral:

Yoga Trainer Deepika Mehta Trained Yoga to Famous Celebrities, Photos Goes Viral on Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs