Advertisement
Google Ads BL

రాశిఖన్నా.. ఎంత తగ్గించుకున్న నో ఛాన్స్..!


జై లవ కుశ సినిమా వరకు బాగా బొద్దుగా వున్న రాశి ఖన్నా.. రవితేజతో కలిసి నటించిన టచ్ చేసి చూడులో కాస్త బరువు తగ్గింది. అయినా ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో.. రాశి ఖన్నా తన బరువు మీద బాగా కాన్సంట్రేట్ చేసింది. జిమ్ లో తెగ కష్టపడి ఒళ్ళు, కొవ్వు రెండు కరిగించేసింది. ఆ వెంటనే వరుణ్ తేజ్ పక్కన తొలిప్రేమలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాని వెంకీ అట్లూరి అందమైన ప్రేమకథగా మల్చడమే కాదు.. రాశి ఖన్నాని చాలా అందంగా చూపెట్టడంతో.. ఆ సినిమా తరవాత రాశి ఖన్నాకి నితిన్ పక్కన దిల్ రాజు బ్యానర్లో శ్రీనివాస కళ్యాణం సినిమాలో ఛాన్స్ అందుకుంది. మరి ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం సినిమా పూర్తయ్యి ప్రేక్షకుల దగ్గరికి రావడానికి రెడీ గా వుంది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో రాశి ఖన్నా క్యూట్ లుక్స్, ట్రెడిషనల్ గా అదరగొడుతున్నాయి. మరి ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం అయితే పక్కాగా ఉన్నాయి. మరి ఈ సినిమా తర్వాత రాశి ఖన్నాకి నో ఛాన్స్ అనే బోర్డు అయితే టాలీవుడ్ లో కనబడుతుంది. శ్రీనివాస కళ్యాణం సినిమా తరవాత ఎటువంటి సినిమా రాశి చేతిలో లేదు. మరి యంగ్ హీరోల చిత్రాలేమి ప్రస్తుతం మొదలయ్యే సూచనలు ఇప్పట్లో  లేవు. ఎందుకంటే ఇప్పటికే యంగ్ హీరోల సినిమాలు చాలా.. హీరోయిన్స్ తో కలిపి మొదలైపోయాయి. మరి రాశి కి శ్రీనివాస కళ్యాణం తర్వాత మరే సినిమాలోనూ ఛాన్స్ లేదు. మరి సినిమా హిట్ అయితే ఏమన్నా రాశికి మళ్ళీ అవకాశాలు తగులుతాయేమో చూడాలి.

ఇకపోతే శ్రీనివాస కళ్యాణం సినిమాలో రాశి ఖన్నా లుక్స్ ఏమో కానీ... బయట అంటే శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో చీరకట్టు.. ఇలా ట్రెడిషనల్ గా మాత్రం అదరగొడుతుంది. ఇకపోతే రాశి ఖన్నా తెలుగులో అవకాశాలేమో కానీ.. తమిళ్ లో మాత్రం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఏది ఏమైనా రాశి ఖన్నాకి శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత సినిమా ఏంటనేది మాత్రం క్లారిటీ అయితే లేదు.

No Movie After Srinivasa Kalyanam to Raashi Khanna:

No Telugu Offers to Raashi Khanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs