Advertisement
Google Ads BL

గోవిందం కాదు.. ఇకపై కామ్రేడ్..!


యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'కామ్రేడ్' రెగ్యులర్ షూటింగ్ నిన్న (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు. ఆంధ్రా స్లాంగ్ లో విజయ్ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. సోషల్ రెస్పాన్సబిలిటీ ఉన్న ఇంటెన్స్ రోల్ ను విజయ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తదితరులు.. 

సాంకేతిక వర్గం: కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్-బిగ్ బెన్ సినిమాస్, నిర్మాతలు: నవీన్ యెర్నేని-రవి శంకర్ యలమంచిలి-మోహన్ చెరుకూరి (CVM)-యష్ రంగినేని, సహ-నిర్మాత: ప్రవీణ్ మార్పురి, సి.ఈ.ఓ: చెర్రీ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, డి.ఓ.పి: సుజిత్ సారంగ్, ఎడిటర్-డి.ఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్, మాటలు: జై కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, లిరిక్స్: కృష్ణకాంత్, చైతన్య ప్రసాద్, వనమాలి, రెహమాన్,కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ బైరి-శ్రావ్యవర్మ, యాక్షన్ డైరెక్టర్: జి.మురళి, కొరియోగ్రఫీ: రఘు మాస్టర్, పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

Dear Comrade Shooting Starts:

Vijay Deverakonda’s new movie ‘Dear Comrade’ has Started Shooting from August 6th 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs