Advertisement
Google Ads BL

ఫ్రైడే విడుదలైన 3 సినిమాల పరిస్థితి ఇది!


గత శుక్రవారం విడుదలైన సినిమాల్లో గూఢచారి సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా... చి. ల.సౌ సినిమా హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఇక బ్రాండ్ బాబు మాత్రం బ్యాండ్ బజాయించింది. అడివి శేష్ హీరోగా ఆరు కోట్ల రూపాయల లో బడ్జెట్ తో తెరకెక్కిన గూఢచారి సినిమా మంచి వసూళ్ళని రాబడుతుంది. విడుదలైన  ఫస్ట్ డే 90 లక్షల వరల్డ్ వైడ్ షేర్ తో మొదలుపెట్టిన గూఢచారి మూడు రోజులకు గాను సుమారు 3.25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చినట్టు సమాచారం. అందులోను ఈ సోమవారం కూడా తెలంగాణాలో గూఢచారి వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం తెలంగాణ మొత్తానికి బోనాల సెలవు రావడం గూఢచారికి కలిసొచ్చే అంశం. ఎలా లేదన్నా గూఢచారి ఈ నాలుగు రోజుల్లోనే తాను పెట్టిన పెట్టుబడి తెచ్చేయాలి. లేదంటే శ్రీనివాస కళ్యాణం, విశ్వరూపం 2 మధ్య నలిగిపోవడం ఖాయం.

Advertisement
CJ Advs

సుశాంత్ హీరోగా రాహుల్ డైరెక్షన్ లో వచ్చిన చి. ల.సౌ టాక్ బావుంది.. సినిమా హిట్ అంటున్నారు. కానీ వసూళ్లుగా అంతంత మాత్రంగా ఉండడంతో నిర్మాతలో కంగారు మొదలైంది. లో బడ్జెట్ లో తెరకెక్కినప్పటికీ...ఈ సినిమా వసూళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి కానీ సూపర్ గా అనిపించడం లేదు. చి.ల.సౌ ఫస్ట్ డే 40 లక్షల షేర్ తో చాలా స్లోగా స్టార్ట్ అయి ఆదివారం అనూహ్యంగా పికప్ అయ్యిందని అంటున్నారు. ఇక ఈ మూడు రోజుల్లో చి.ల.సౌ 1.20 లక్షల దాకా కొల్లగొట్టిందనే టాక్ వినబడుతుంది. ఇక చి.ల.సౌ కి.. సోమవారం కూడా తెలంగాణాలో కలిసొచ్చే అవకాశం ఉంది.

ఇక మారుతి నిర్మాతగా ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రాండ్ బాబు సినిమా ఏ విధముగానూ ఆకట్టుకోలేపోతోంది. విడుదలైన మొదటి షోకే నెగెటివ్ టాక్ రావడం.. సినిమాకి కలెక్షన్స్ కూడా రావడం లేదు. ఎంత తక్కువ బడ్జెట్ తో తీసినా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేలా కనబడడం లేదు. బ్రాండ్ బాబు మూడు రోజులకు గాను కేవలం అంటే కేవలం 40 లక్షల షేర్ తెచ్చి ఉసూరుమనిపించింది.

Goodachari in First Place in 3 movies:

Goodachari and Chi La Sow Hit and Brand Babu Flop at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs