Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లీక్ రాయుళ్లేవరో తెల్సిపోయింది!


బిగ్ బాస్ సీజన్ 2 .. ఇప్పుడు ఆ షో కన్నా ఎక్కువగా ఆ షో నుండి బయటికొస్తున్న లీకులే ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటి వరకు దాదాపుగా అర్ధ భాగం పూర్తి చేసుకుంది. అయితే ఈ షోని నాని తనదైన శైలిలో వీకెండ్స్ లో ఆకట్టుకునేలా యాంకరింగ్ చేస్తున్నాడు. మరోపక్క తేజస్వి ఎలిమినేట్ తో షో లో కాస్త పస తగ్గింది. తేజస్వి చాలా యాక్టీవ్ గా, స్పైసి గా బిగ్ బాస్ షోని ఒంటి చేత్తో నడిపించింది. కానీ తన నోరు అదుపులో పెట్టుకోలేకపోవడంతోనే ఆమె షో నుండి బయటికెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈ తేజు విషయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే బిగ్  బాస్ హౌస్ నుండి తేజస్వి ఫైనల్ కంటెస్టెంట్ గా ఉంచాలనే భావంతో ఆమెని షోకి తీసుకొచ్చారు. కానీ కౌశల్ మీద ఆమె చేసిన ఆరోపణలతో కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతూ తేజస్వి ని టార్గెట్ చేస్తూ బిగ్ బాస్ ని తేజస్వి ని సపోర్ట్ చేస్తున్న నానిని ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తూ బిగ్ బాస్ కి తేజస్వి ని ఎలిమినేట్ చెయ్యడం తప్ప మరోదారి లేకుండా చేసింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా బిగ్ బాస్ లీకులపై సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ నడుస్తుంది. బిగ్ బాస్ షో 2 మొదలైనప్పటి నుండి బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మరియు వైల్డ్ కార్డు ఎంట్రీ.. అలాగే ఎలిమినేట్ అయిన వారిలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే సభ్యులు ఇలా అన్ని విషయాల్లో బిగ్ బాస్ షో కన్నా ముందే సోషల్ మీడియాలో లీకైపోవడం బిగ్ బాస్ నిర్వాహకులకు సమస్యగా మారింది. ఏం చేసిన ఈ లీకులు ఆగడం లేదు. సంజన ఎలిమినేషన్ నుండి నిన్న ఆదివారం నందిని రాయ్ ఎలిమినేషన్ వరకు ఈ లీకులు సాగుతూనే ఉన్నాయి. అయితే ఈ లీకులు ఎక్కడినుండి వస్తున్నాయో అనేది ఇప్పుడు బయటికి వచ్చింది. అదేమిటంటే గత బిగ్ బాస్ సీజన్ ని పూణే దగ్గరలో సెట్ వేసి మరి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అంటే అక్కడ నుండి ఏ విషయం బయటికి రావాలన్న ఒక రోజు టైం పట్టేది.

కానీ తాజాగా బిగ్ బాస్ షో హైదరాబాద్ నడిబొడ్డున అన్నపూర్ణ స్టూడియోలో వెయ్యడం.. అలాగే ఈ షో ని రాత్రి ప్రసారం చేస్తుంటే.. దానికి సంబంధించి ప్రేక్షకులకు ఏం చూపించాలో అనేది ఆ రోజు  ఉదయమే డిసైడ్ చెయ్యడంతో.. ఆ షో లో ఏం జరుగుతుందో అనేది ఈజీగా బయటికొచ్చేస్తుంది. అలాగే ఉదయమే ఈ షో నుండి బయటికొచ్చే వారు హైదరాబాద్  కావడంతో వారు క్యూరియాసిటితో అందరికి కనిపించడంతోనే వారు ఎలిమినేషన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే పూణే లో అయితే అక్కడ నుండి ఎలిమినేషన్ అయ్యి బయటికి వచ్చి హైదరాబాద్ చేరుకునే సరికి ఆ షో టివి లో ప్రసారం జరిగిపోయేది. సో అలాగే పూణే కి వర్క్ చేసిన టెక్నీకల్ టీమ్ మొత్తం ముంబై టీమ్ కావడం.. ఇక్కడ హైదరాబాద్ లో బిగ్ బాస్ కి పనిచేసే టీమ్ మొత్తం తెలుగు వారు కావడంతోనే ఈ లీకులు దావానంలా వ్యాపిస్తున్నాయంటున్నారు. సో బిగ్ బాస్ లీకులు ఈ విధంగా బయటికొస్తున్నాయన్నమాట.

Secret Revealed Behind the Leaks of Bigg Boss 2 Telugu:

Who is Behind Bigg Boss 2 Telugu Leaks? <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs