Advertisement
Google Ads BL

సాయిపల్లవి.. నిజంగా హైబ్రిడ్ పీసే..!!


ఈమధ్యన ఎటు చూసిన ఫిదా భామ సాయి పల్లవి మీదే మీడియా ఫోకస్ ఉంది.  ఈమధ్యన సాయి పల్లవిపై నెగెటివ్ న్యూస్ లు బాగా ఎక్కువయ్యాయి. ఆమె ఏ సినిమా షూటింగ్లో ఉన్నా.. అక్కడ సాయి పల్లవిపై ఏదో ఒక నెగెటివ్ న్యూస్ ప్రచారంలోకొచ్చేస్తుంది. ఒకటా రెండా ఎంసీఏ అప్పుడు నానితో.. కణం అప్పుడు నాగశౌర్యతో, NGK  అప్పుడు ఆ సినిమా దర్శకుడితో.. తాజాగా పడి పడి లేచె మనసు అప్పుడు శర్వానంద్ తో ఇలా ఆమెకి హీరో, దర్శకులతో విభేదాలు వస్తున్నాయనే న్యూస్ మాములుగా వినబడడం లేదు. ఈ లోపు ఆమెకి సినిమాలో తన పాత్ర నచ్చితేనే.. సినిమాలు ఒప్పుకుంటుంది. లేదంటే మొహమాటం లేకుండా నో చెప్పేస్తుందనే టాక్ కూడా ఉంది. ఇప్పటికే దిల్ రాజు అడిగితే శ్రీనివాస కళ్యాణం సినిమా చెయ్యనందని.. అందుకే సాయి పల్లవి ప్లేస్ లో రాశిఖన్నాని తీసుకున్నారంటారు .

Advertisement
CJ Advs

తాజాగా ఇప్పుడు సాయి పల్లవి మరో బడా నిర్మాత చేసిన కోట్ల ఆఫర్ ని కాలదన్నిందంటున్నారు. తన కొడుకుని స్టార్ హీరో చెయ్యడానికి ఆ నిర్మాత ఎప్పటి నుండో కలలు కంటున్నాడు. అందుకే భారీ బడ్జెట్ లతో సినిమాలు చెయ్యడమే కాదు.. తన కొడుకు కోసం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ ని తీసుకొస్తాడు. కానీ అతను మాత్రం స్టార్ హీరోగా ఎదగలేక ఇబ్బంది పడుతున్నాడు. అయినా ఆ నిర్మాత పట్టువదలని విక్రమార్కుడిలా కొడుకు కోసం ఇంకా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్ మొత్తం అతని కొడుకు పక్కన నటించారు. ఇక సాయి పల్లవి క్రేజ్ తో అయినా తన కొడుక్కి కాస్త పేరొస్తుందని అతను అనుకోవడం సాయి పల్లవిని కలవడం.. ఆమెకు 2  కోట్లు ఆఫర్ చేయడం జరిగిందట. ఇంతకు ముందు టాప్ హీరోయిన్స్ కి కూడా ఆ నిర్మాత ఇలానే అధిక పారితోషకం ఆఫర్ చేసి తన కొడుకు పక్కన వాళ్ళని నటింప చేశాడు. మరి భారీ పారితోషకాలకు టాప్ హీరోయిన్స్ సలాం చేశారు. 

కానీ ఇక్కడ సాయి పల్లవి మాత్రం ఆ బడా నిర్మాతకి షాకిచ్చిందనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. డబ్బు కోసం తాను నటించనని సినిమాలో తన క్యారెక్టర్ కుండే ప్రాధాన్యత తోనే సినిమా చేస్తానని చెప్పి ఆయన్ని పంపేసిందట. మరి టాప్ హీరోయిన్ కూడా డబ్బుకి పడిపోతే ఈ పిల్ల ఏమిటండి.. ఇలా.. నిజంగానే ఈ పిల్ల హైబ్రిడ్ పిల్లనే అంటున్నారు అంతా.

Sai Pallavi Rejected Top Producer Offer:

Sai Pallavi Rejects Rs 2 Cr Offer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs