Advertisement
Google Ads BL

ఎంట్రీనే సీఎం.. ఇప్పుడు మళ్లీ సీఎం..!!


నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల అవ్వబోతుందని రీసెంట్ గా బాలకృష్ణ ఓ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. మొదటి నుండే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి రానా.. అక్కినేని సుమంత్ జాయిన్ అవ్వడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

Advertisement
CJ Advs

మొదట ఈ సినిమా స్క్రిప్ట్ డైరెక్టర్ తేజ చేతిలో ఉన్నప్పుడు రెండు భాగాలూ ప్లాన్ చేశారు. మొత్తం 150 సీన్స్ తో స్క్రిప్ట్ రెడీ చేశారు తేజ. అలా అయితే సినిమా బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని బాలయ్య నో చెప్పడం వల్లే బాలయ్య తేజల మధ్య విభేదాలు వచ్చాయని టాక్ కూడా ఉంది. ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ క్రిష్ చేతిలోకి రాగానే సగానికి కట్ చేశాడంట. అంటే ఇప్పుడు అయన 75 సీన్స్ లతోనే సినిమా తీస్తున్నాడట.

మొదటి హాఫ్ లో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ స్టూడియో పెట్టడంతో మొదలుపెట్టి ఇంటర్వెల్ బాంగ్ కి మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారంతో ముగిస్తారట. సెకండ్ హాఫ్ లో తను స్థాపించిన పార్టీ టిడిపిని ఎలా అధికారంలోకి తీసుకుని వచ్చారు...అప్పుడు ఎంత కష్టపడ్డారు..అయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అన్న విషయాలు ఈ సినిమాలో చూపించనున్నారట. అసలు చంద్రబాబు ఎన్టీఆర్ కు ఎలా దగ్గర అవుతాడు..చంద్రబాబు ఎన్టీఆర్ పక్కన ఉండి మళ్లీ సీఎం కావడంలో చేసిన విశేష కృషిని హైలైట్ చేయబోతున్నట్టు సమాచారం.

ఇక రెండోసారి సీఎం అయ్యాక జయకేతనం ఎగరవేసినట్టు చూపించి శుభం కార్డు వేస్తారని ఫిలింనగర్ టాక్. 'మహానటి' తరహాలో ఈ సినిమాను చూపించబోతున్నారని టాక్. ఎలక్షన్స్ సమయంలో ఈ సినిమాను తీసుకుని రావడం టిడిపికి ప్లస్ అవుతుందని చెబుతున్నారు.

Rana Daggubati Proud to Play AP CM in 'NTR' Biopic :

Rana Daggubati to Play N. Chandrababu Naidu in 'NTR' Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs