ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై యూత్‌స్టార్ నితిన్ హీరోగా, రాశీ ఖన్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'శ్రీనివాస కళ్యాణం'. ఆగస్ట్ 9న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ మూవీ ప్రీమియర్‌ను వీక్షించారు.
అనంతరం సహజ నటి జయసుధ మాట్లాడుతూ... 'పెళ్లి, మన సంప్రదాయాలు, బాంధవ్యాల గురించి తెలియజేసే సినిమా ఇది. చాలా ప్లెజెంట్‌గా సినిమా చేశాం. అందమైన సినిమా ఇది. ఆగస్ట్ 9న సినిమాను విడుదల చేస్తున్నాం. మంచి సినిమాలను నిర్మించే దిల్‌రాజుగారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రేమ, బంధాలు, బాంధవ్యాలు గురించి గొప్పగా చూపించిన చిత్రమిది. నితిన్ ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. రాశీఖన్నా, నందితా అందరూ చక్కగా నటించారు. డైరెక్టర్ సతీశ్‌గారు ఒక్కొక్కరికీ ఒక్కొక్క చక్కటి సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉంది' అన్నారు.
సితార మాట్లాడుతూ... '33 సంవత్సరాలుగా నేను సినిమాలు చేస్తున్నాను. అయితే నా హృదయానికి దగ్గరైన సినిమాలు కొన్ని మాత్రమే. అలాంటి సినిమాల్లో శ్రీనివాస కళ్యాణం ఒకటి. వండర్‌ఫుల్ మూవీ. సినిమా చూసిన పెళ్లికానీ వారికి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. ఇలాంటి మంచి సినిమాలు చేసే అవకాశాన్ని ఆ వేంకటేశ్వరుడు కల్పించాలని కోరుకుంటున్నాను. చాలా ఎమోషన్స్ ఉన్న సినిమా. ప్లెజెంట్‌గా ఉంటుంది. నితిన్ గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన కెరీర్‌లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. రాశీఖన్నా, నందితలు చక్కగా నటించారు' అన్నారు.
సీనియర్ నరేశ్ మాట్లాడుతూ... 'ఈవాళ పెళ్లి అనేది బిజినెస్ అయిపోయింది. కానీ పెళ్లి అంటే ఓ ప్రమాణం అని చెప్పే ఏకైక దేశం భారతదేశం. మన జీవితంలో ఓ గొప్ప మూమెంట్ పెళ్లి. అలాంటి పెళ్లిని ఇంత అందంగా చూపించిన చిత్రమిది. ఏ సినిమాలో పెళ్లిని ఇంత గొప్పగా చూపించలేదు. తెలుగులో ఏ భాషలో తీసినా హిట్ అయ్యే సినిమా ఇది. లైఫ్ టైమ్ హిట్ అవుతుంది. మెమరబుల్ హిట్ అవుతుంది. నితిన్‌కి 'అ..ఆ'ని క్రాస్ చేసే సినిమా అవుతుంది. నటుడిగా పది మెట్లు నితిన్ పైకెదిగాడు. రాశీఖన్నా అద్భుతమైన క్యారెక్టర్‌ను కమిట్‌మెంట్‌తో చేసింది. పాటల్లో తెలుగుదనంతో మిక్కీ మంచి సంగీతాన్ని అందించారు. సమీర్‌రెడ్డి ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా విజువలైజ్ చేశారు. దిల్‌రాజుగారితో నా సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో సినిమా చేస్తున్నాను. బొమ్మరిల్లులా ఈ సినిమా గుర్తుండిపోతుంది. శతమానం భవతి కానీ శ్రీనివాస కళ్యాణం సినిమాలను చూస్తే.. వినోదంతో పాటు టెక్నాలజీని కలిసి హ్యుమన్ కనెక్ట్‌తో సినిమా చేసే దర్శకుడు సతీశ్. మరో నేషనల్ అవార్డ్ వస్తుందనుకుంటున్నాను. కె.విశ్వనాథ్‌గారి తర్వాత మన కల్చర్‌ను కలిపి సినిమాలు తీసే దర్శకుడు సతీశ్ వేగేశ్న' అన్నారు.