Advertisement
Google Ads BL

సొట్టబుగ్గల సుందరి కష్టం చూడండి!


బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా 1990ల చివరలో ఓ వెలుగు వెలిగిన సొట్టబుగ్గల సుందరి ప్రీతీజింటా. ఈమె మణిరత్నం దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్‌ హీరోగా వచ్చిన 'దిల్‌సే' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. వెంటనే ఆమె తన రెండో చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వెంకటేష్‌ హీరోగా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమంటే ఇదేరా',1999లో మహేష్‌బాబు డెబ్యూ మూవీ 'రాజకుమారుడు' చిత్రాలలో యాక్ట్‌ చేసింది. 2016లో అమెరికాకు చెందిన 'జీని గూడెనఫ్‌'ని వివాహం చేసుకుంది. 

Advertisement
CJ Advs

ఇక తన రీఎంట్రీగా 2013లో వచ్చిన 'ఇష్క్‌ ఇన్‌ ప్యార్‌'లో యాక్ట్‌ చేసింది. ఇప్పుడు ఆమె వయసు 43 ఏళ్లు. కానీ ఆమె నాడు ఎలా ఉందో నేడు కూడా అలాగే, అదే ఫిజిక్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. దీనికి ఆమె చేసే జిమ్‌వర్కౌట్సే కారణమని చెబుతుంది. ఇక తాజాగా ఆమె జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్న వీడియోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. నా జిమ్‌ ట్రైనర్‌ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడని సరదాగా వ్యాఖ్యానించింది. 'సులభంగా పనులు అయిపోతే లాభం లేదు. చూడండి.. హృదయం లేని ఈ ట్రైనర్‌ జిమ్‌లో నన్ను ఎలా చంపుతున్నారో' అంటూ వ్యాఖ్యానించింది. క్రమం తప్పకుండా ఆమె చేస్తున్న వ్యాయామాల వల్లే ఈ వయసులో కూడా ఆమె అందంతో మెరిసిపోతోందని అర్ధమవుతోంది. 

Click Here For Video

Preity Zinta New GYM Video Hulchal in Social Media:

Dimpled Actress Preity Zinta Is A Powerhouse Of Strength, Shares Her Workout Videos
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs