Advertisement
Google Ads BL

నెక్స్ట్ నువ్వే.. బ్రాండ్ బాబు.. మళ్లీ ఛాన్సొస్తుందా?


ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన దర్శకుణ్ణి, హీరోని కూడా మోసేస్తారు. కానీ సినిమా ప్లాప్ అయ్యిందా.. మొత్తం బాధ్యత దర్శకుడి మీదే పడుతుంది. తాజాగా ఒక దర్శకుడుకి ప్రస్తుతం అదే పరిస్థితి కనబడుతుంది. దర్శకుడు మారుతి దర్శకుడిగానే కాకుండా చిన్న సినిమాలను నిర్మించడంతో పాటుగా.. తన దగ్గరున్న కథలతో బయటి దర్శకులతో చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తుంటాడనే సంగతి తెలిసిందే. గతంలో మారుతి  కథతో అతని నిర్మాణంలో వచ్చిన ప్రేమ కథ చిత్రం హిట్ అవడంతో.. ఆ క్రెడిట్ మొత్తం మారుతినే తీసుకున్నాడు. కానీ తాజాగా మారుతీ కథతో సీరియల్ దర్శకుడు కమ్ నటుడు, నెక్స్ట్ నువ్వే సినిమా దర్శకుడు ఈటివి ప్రభాకర్ తో బ్రాండ్ బాబు సినిమా చేశాడు మారుతీ. మరి మారుతీ ఈ బ్రాండ్ బాబు కథని ఇంతకు ముందు హీరో శర్వానంద్ కి చెప్పగా... అతను రిజెక్ట్ చెయ్యడం... తర్వాత బ్రాండ్ బాబు కథను పక్కన పడేసి.. మారుతి.. శర్వానంద్ కి మహానుభావుడు వర్కౌట్ చేసి సినిమా చేస్తే అది హిట్ అవడంతో.. తన దగ్గరున్న బ్రాండ్ బాబు కథని ఈటివి ప్రభాకర్ చేతిలో పెట్టగా.. ప్రభాకర్ తాను సీరియల్స్ ని ఎలా డైరెక్ట్ చేస్తాడో సేమ్ అదే విధంగా బ్రాండ్ బాబు కథను తెరకెక్కించాడు. 

Advertisement
CJ Advs

అంతకుముందు ప్రభాకర్ సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా చేసిన నెక్స్ట్ నువ్వే సినిమా కూడా అట్టర్ ప్లాప్ అవడంతో.. ప్రభాకర్ దర్శకుడిగా బ్రేక్ తీసుకుని సీరియల్స్ లో  నటిస్తున్నాడు. అయితే మారుతికి ప్రభాకర్ మీద ఏం గురి కుదిరిందో తెలియదు కానీ.. బ్రాండ్ బాబు కథను ప్రభాకర్ చేత డైరెక్ట్ చేయించాడు. ఇక బ్రాండ్ బాబు కథకు తగ్గట్టే ఈ డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉండడంతో సినిమా అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా కథలో బలం లేకపోబట్టే మారుతి కూడా సినిమా ప్రమోషన్స్ ని లైట్ తీసుకున్నాడు. సినిమాలో కంటెంట్ లేకపోవడమే కాదు.. అసలు ఏ విధంగానూ  సినిమా మెప్పించలేకపోయింది.

హీరో, హీరోయిన్, డైరెక్టర్, ఎడిటిండ్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ ఇలా అన్నీ.. బ్రాండ్ బాబు సినిమా ప్లాప్ కి కారణాలే. ఇక బ్రాండ్ బాబు సినిమాని ప్రభాకర్ అచ్చం సీరియల్  మాదిరిగా తెరకెక్కించాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో భీభత్సంగా పడుతున్నాయి.  మరి ఇలాంటి సినిమాలు చేసిన ఈటివి ప్రభాకర్ కి మరో సినిమా కి డైరెక్టర్ అవకాశం రావడం కల్లే. 

Director Prabhakar Failed Again :

Who Gives Chance to Prabhakar After Two Flops
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs