Advertisement
Google Ads BL

రాజమౌళి వేటలో ఉన్నాడు..!!


రాజమౌళి ఏమంటా రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ చేశాడో గాని... అప్పటినుండి  ఆ సినిమాపై ఏ చిన్న వార్త అయినా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ఆయన సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో కానీ.. సినిమా మొదలవ్వకముందే #RRR ట్యాగ్ లైన్ తో భారీ బడ్జెట్ తో డి. వి. వి తెరకెక్కించబోయే ఈ సినిమాకి ఒక రేంజ్ లో బిజినెస్ జరిగేలా కనబడుతుంది. మరి రాజమౌళి గత సినిమా బాహుబలి కళాఖండం సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అందుకే ఆయన తదుపరి ప్రాజెక్ట్ మీద అంత క్రేజు.. అలాగే ఎన్టీఆర్, చరణ్ లు ఇద్దరు కలిసి నటించడం అంటే మెగా.. నందమూరి ఫ్యాన్స్ కి అంతకన్నా ఏం కావాలి.

Advertisement
CJ Advs

ఇకపోతే ఆక్టోబర్లో మొదలవుతుంది అని చెబుతున్న ఈ సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను రాజమౌళి చక్కబెడుతున్నాడు. అంతేనా.. ఈ మల్టీస్టారర్ సినిమాకి సంబందించిన సెట్ లు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఉండే ఒక సెట్ నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమా బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఉండబోతుంది గనక ఈ సినిమాలోని ఆ కాలం సెట్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఆ కాలంలో వాడిన వస్తువులు అప్పటి వాతావరణానికి సంబంధించినవే.... ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివే ఉండేలా చూసుకుంటున్నారట.

ఇక కేవలం అల్యూమినియం ఫ్యాక్టరీలోనే కాక రామోజీ ఫిలిం సిటీ ఇలా మరికొన్ని ప్రాంతాల్లో ఈ RRR కోసం సెట్స్ నిర్మాణం చేపట్టడానికి గాను రాజమౌళి అండ్ సెంథిల్ కుమార్ లు లొకేషన్స్ వేటలో ఉన్నారట. గతంలోనే హైదరాబాద్‌కు సమీపంలోని కొల్లూరు గ్రామ పరిసర ప్రాంతాలను రాజమౌళి టీమ్‌ పరిశీలించారు. ఇక హైదరాబాద్ లోని మరిన్ని అనుకూల ప్రాంతాల్లో RRR షూటింగ్ కోసం సెట్స్ నిర్మాణానికి గాను స్థలాలను వెతికే పనిలో ఉన్నారట. మరి అన్ని రెడీ చేశాకే రాజమౌళి ఆ ఇద్దరు స్టార్ హీరోలతో రంగంలోకి దిగుతాడట. ఇప్పటికే RRR లో నటించబోయే హీరోయిన్స్ వేట కూడా కొనసాగుతుంది.

RRR Movie Locations Search by Rajamouli and Senthil Kumar:

RRR Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs