Advertisement
Google Ads BL

నిశ్చితార్ధం క్యాన్సిలా.. ఎవరు చెప్పారు..?


కన్నడలో 'కిర్రాక్‌ పార్టీ' అనే ఒకే చిత్రంలో కన్నడ ప్రేక్షకులనే కాదు.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్‌ రష్మికా మందన్న. ఈమె తెలుగులో కూడా నాగశౌర్య హీరోగా రూపొందిన హిట్‌ మూవీ 'ఛలో'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. త్వరలో విజయ్‌దేవరకొండతో నటించిన 'గీతాగోవిందం' విడుదల కాబోతుంది. ఇక ఈమెని తమ తమ చిత్రాలలో పెట్టుకోవాలని పలువురు దర్శకనిర్మాతలు, హీరోలు పోటీ పడుతున్నారు. మరోపక్క రష్మిక మండన్న తన మొదటి చిత్రం 'కిర్రాక్‌ పార్టీ' సమయంలోనే నటుడు, దర్శకుడైన రక్షిత్‌శెట్టి ప్రేమలో పడింది. ఇద్దరి నిశ్చితార్ధం కూడా జరిగింది. 

Advertisement
CJ Advs

అయితే రక్షిత్‌ శెట్టికి తనకు కాబోయే భార్య హీరోయిన్‌గా నటించడం ఇష్టం లేదని, ముఖ్యంగా 'గోతాగోవిందం'లో ఆమె విజయ్‌దేవరకొండతో పోస్టర్స్‌ ద్వారానే కైపు ఎక్కిస్తూ ఉండటంతో కోపం వచ్చి నిశ్చితార్ధం క్యాన్సిల్‌ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక పీఆర్వో స్పందించాడు. రష్మిక, రక్షిత్‌ శెట్టిల ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయిందనే వార్తల్లో అసలు నిజం లేదు. వారి మద్య మంచి లవ్‌ బాండింగ్‌ ఉంది. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి భలే ఇష్టం. ఇద్దరు కలసి ఎప్పటిలానే ఫంక్షన్లకు వెళ్తున్నారు. వారి ఎంగేజ్‌మెంట్‌ రద్దు అయిందనే వార్తలను నమ్మవద్దని ఆయన కోరాడు. 

సో.. రష్మిక, రక్షిత్‌శెట్టిలు ఇప్పటికీ కాబోయే జంటగా అందరిని అలరిస్తున్నారన్న విషయంపై పుకార్లకు చెక్‌ పడి ఓ క్లారిటీ వచ్చింది. మరి నటిగా బిజీగా ఉన్న రష్మిక వరస అవకాశాలను ఒప్పుకుంటూ పెళ్లిని కాస్త వాయిదా వేస్తుందా? లేక సినిమా చాన్స్‌లను లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంటుందా? అనేది వేచిచూడాల్సిన విషయం. 

Clarity on Geetha Govindam Girl's Breakup Rumours:

Rakshit Shetty And Rashmika Mandanna's Grand Engagement Finished
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs