Advertisement
Google Ads BL

అలా చూస్తే తృప్తిగా ఉంటుంది: రష్మీ!


ఆగస్టు 24న విడుదలవుతున్న 'అంతకు మించి' చిత్రం  

Advertisement
CJ Advs

ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం 'అంతకు మించి'. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర  విడుదల తేదీని శనివారం 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతిచే  అనౌన్స్ చేయించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే అంతకుమించి సినిమాలో కనపడుతోంది. ట్రైలర్ చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఇక ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత జై నాకు మంచి  మిత్రుడు. మొదటిసారిగా తను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదలవుతోంది తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నాను.. అన్నారు.

దర్శకుడు జానీ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను సుకుమార్ గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్  కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. మ్యూజిక్, కెమెరా.. వర్క్ ఔట్ అయితే సినిమా వర్క్ ఔట్ అవుతుందని చెప్పాను  వారిద్దరూ అదే ఫాలో అయ్యి అద్భుతంగా ఇచ్చారు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. 

హీరో జై మాట్లాడుతూ.. సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. మా సహ నిర్మాతలు భాను, కన్నాలు నాకు ఎంతగానో సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది.. అని అన్నారు. 

హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. అందరి ఎఫర్ట్ ఈ అంతకు మించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జి కూడా ఉంది. ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా.. అన్నారు. 

భాను ప్రకాష్, కన్న తిరుమనాధం, పద్మనాభ రెడ్డి, టి ఎన్ ఆర్, హర్ష, ఈశ్వర్, సాహితీ, సుజాత, రాజబాల, వంశీ తదితరులు ఈ కార్యక్రమానికి  హాజరయ్యి తమ అభినందనలను మరియు అనుభవాలను పంచుకున్నారు.

జై, రష్మీ గౌతమ్, అజయ్ ఘోష్, టి ఎన్ ఆర్, మాధునందన్, హర్ష, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మోహన్ చందా, సినిమాటోగ్రఫి: పి. బాలిరెడ్డి, ఎడిటర్: క్రాంతి(ఆర్ కె), సంగీతం: సునీల్ కశ్యప్, ఆర్ట్: నాగు, కొరియోగ్రాఫర్: సుదీర్ కుమార్, ఫైట్స్(రామ్ సుంకర), కో-డైరెక్టర్: ఎ. మధు సుధన రెడ్డి, సంపత్ రుద్రారపు, ఇనుముల ఉమామహేశ్వరరావు, కో- ప్రొడ్యూసర్స్: భాను ప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం,  నిర్మాత: సతీష్, ఎ. పద్మనాభ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జానీ.

Anthaku Minchi Movie Release Date Announcement:

Anthaku Minchi Movie Press Meet Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs