Advertisement
Google Ads BL

'గూఢచారి' హిట్టుకు ఇదొక కారణం..!!


సినిమా మేకర్స్ కి తమ సినిమా ఎప్పుడూ బాగుంటదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాను అంతలా నమ్మి తీస్తారు కనుక. ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలనే సినిమాను తీస్తారు. కానీ దాని పరిస్థితి ఏంటో బయట చూసిన జనాలే డిసైడ్ చేస్తారు. అందుకే మన మేకర్స్ సినిమా యొక్క ఫీడ్ బ్యాక్ కోసం సినిమా రిలీజ్ కి ముందే కొంత‌మందికి చూపించ‌డం అల‌వాటు.

Advertisement
CJ Advs

అలానే లేటెస్ట్ గా రిలీజ్ అయిన 'గూఢచారి'కీ అలాంటి ఫీడ్ బ్యాకే తీసుకున్నాడు అడ‌విశేష్‌. సినిమా రిలీజ్ కి ముందు దాదాపు వెయ్య మంది చూశారంట. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని సినిమా ఎక్కడ స్లో అవుతుంది..లాజిక్స్ ఎక్కడ మిస్ అవుతున్నాయి అన్న అంశాలపై ఆరా తీశాడట హీరో అడివి శేష్.

వాళ్ల అభిప్రాయాల‌కు విలువ ఇస్తూ రీషూట్లు కూడా చేసుకుంటూ వెళ్లాడు. ఇలా చేయడం వల్ల సినిమాకు మంచి రిపోర్ట్స్ వచ్చి బాగా ఆడుతుంది. ఈ సినిమాకి మెయిన్ అసెట్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ప‌రంగా సినిమా బాగుందని చూసిన ప్రతి ప్రేక్షకుడు చెబుతున్నాడు. అలా ముందుగానే జాగ్రత్త పడి సినిమా తీసి సక్సెస్ అయ్యారు. నిజానికి ఇలా సురేష్ బాబు చేస్తాడు. రిలీజ్ ముందే ఓ సినిమాకు తన స్టూడియోలో ప్ర‌తీరోజూ నాలుగు షోలు ప‌డుతుంటాయి. ఎవ‌రెవ‌రో వెళ్లి సినిమా చూసొస్తుంటారు. వాళ్ల వాళ్ల అభిప్రాయాలు చెబుతుంటారు. దాన్ని బట్టే చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను బయటకి రిలీజ్ చేస్తాడు. అలానే ఇప్పుడు అడివి శేష్ కూడా చేశాడు. ఇలా చేయడం మంచి అలవాటే అంటున్నారు సినీ పండితులు.

Reason to Adivi Sesh's Goodachari Hit:

Adivi Sesh Follows Producer Suresh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs