Advertisement
Google Ads BL

ఐష్‌ కొత్త అవతారం చూశారా..!


బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ కోడలిగా, అభిషేక్‌ బచ్చన్‌ భార్యగా మాజీ అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌కి పెళ్లికి ముందు ఉన్న క్రేజ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ పెళ్లయి పాప పుట్టిన తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని 2016లో కరణ్‌జోహార్‌ చిత్రం 'ఏ దిల్‌ హై ముష్కిల్‌'తో రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె నటించిన 'ఫనేఖాన్‌' విడుదలైంది. ఈ చిత్రంలో బేబిసింగ్‌ పాత్రను పోషించిన ఐశ్వర్యాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక దర్శకుడు కెమెరా... రోలింగ్‌.. యాక్షన్‌ అని చెప్పగానే తన పాత్రలోకి ఒదిగిపోవడం ఐశ్వర్యారాయ్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఏ పాత్రలోనైనా ఆమె జీవించేస్తుంది. ఈమె నటిగా 20ఏళ్లుగా మెప్పిస్తూ వస్తోంది. కానీ ఇంతకాలం కెమెరా ముందు కనిపించిన ఆమె ఇకపై కెమెరా వెనుక కనిపించాలని తన కోరికను తెలిపింది. ఐశ్వర్య డైరెక్టర్‌ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. డైరెక్షన్‌ వైపు ఇంట్రస్ట్‌ ఉంది. 

భవిష్యత్తులో ఖచ్చితంగా డైరెక్టర్‌ని అవుతాను. ఏదో డైరెక్టర్‌ కావాలనే ఆశతో పనిచేయను. పూర్తి మనసుపెట్టి చేస్తాను. నేను ఏ పనిచేసినా హార్ట్‌ఫుల్‌గా చేస్తాను. నేను డైరెక్టర్‌ కావాలని చెప్పినప్పటి నుంచి డైరెక్టర్స్‌, ఆర్టిస్ట్‌లు నన్ను ఆటపట్టిస్తున్నారు. నా భర్త అభిషేక్‌ మాత్రం నువ్వు చేయగలవు అని ప్రోత్సాహం అందజేస్తున్నాడని చెప్పుకొచ్చింది. 

Aishwarya Rai Bachchan to turn director 'in a few years':

Aishwarya Rai Bachchan wants to be a director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs