Advertisement
Google Ads BL

ఇది కేసీఆర్‌ తరహా వేధింపేనా..?


అధికారంలో ఉండే వారు తమ మాట వినని నాయకులు, అధికారులపై తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయభ్రాంతులకు గురి చేయడం ఎప్పటినుంచో వస్తున్నదే. ఉదాహరణకు బిజెపి ప్రభుత్వం తమిళనాడుతో పాటు మరికొన్ని చోట్ల ఇదే తరహా బెదిరింపులకు దిగుతోంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం డిక్టేటర్‌ తరహాలో ప్రధాని మోదీ బాటలోనే నడుస్తున్నాడా? అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో పిసిసి ప్రెసిడెంట్‌గా డి.శ్రీనివాస్‌ ఎంతో సక్సెస్‌ అయ్యారు. ఆయనది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిది విజయవంతమైన జోడీ. ఇక డిఎస్‌ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌లో చేరాడు. 

Advertisement
CJ Advs

దీంతో సీనియర్‌ రాజకీయ నాయకుడైన డి.శ్రీనివాస్‌ని అధికార టిఆర్‌ఎస్‌ బాగా ఇబ్బంది పెడుతోందని వార్తలు వస్తున్నాయి. తనకు అసలు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో డీఎస్‌ బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. దీంతో కొన్నిరోజులుగా డిఎస్‌, టిఆర్‌ఎస్‌ మధ్య రగడ మొదలైంది. డీఎస్‌ కుమారుల్లో ఒకడైన అరవింద్‌ బిజెపి పార్టీలో చేరాడు. బిజెపి తరపున ఆయన కేసీఆర్‌ కుమార్తె మీద పోటీగా నిజామాబాద్‌ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తాడని ప్రచారం సాగుతోంది. డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని కవిత బాహాటంగానే విమర్శిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే డీఎస్‌ మరో కుమారుడు సంజయ్‌పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు తెరమీదకి వచ్చాయి. సంజయ్‌ తమని లైంగికంగా వేధిస్తున్నాడని డిఎస్‌కి చెందిన శాంకరీ నర్సింగ్‌ హోమ్‌ విద్యార్దినులు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇలా ఆరోపణలు చేస్తున్న 11మంది విద్యార్ధినిలు పీడియస్‌యూ నేత సంధ్యని కలవగా హోమ్ మంత్రి పోలీస్‌లకు ఫిర్యాదు చేయమని చెప్పి, ఈ కేసును విచారించాల్సిందిగా డిజిపిని ఆదేశించాడు. 

గతంలోనూ సంజయ్‌కి చెందిన కాలేజీ విద్యార్దినులు ఆయనపై ఈ తరహా ఆరోపణలే చేశారు. ఈయనపై ఇలాంటి ఆరోపణలు నిజామాబాద్‌ జిల్లాలో బాగా వ్యాప్తిలో ఉన్నాయి. ఒక్కసారిగా ఇంత మంది విద్యార్ధినులు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దీనిలో రాజకీయకోణం ఉందేమో అనే అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉంటూనే తన కుమారుడిని బిజెపి పార్టీలో చేర్పించి ఎంపీ కవితపై పోటీకి దింపుతుండటంతో డిఎస్‌కి ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు. 

Telangana MP's Son booked under Nirbhaya Act :

Police Examine Charge By Women Students Against D Srinivas’s Son
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs