Advertisement
Google Ads BL

'ఎన్టీఆర్' టీమ్ వీరవిహారం చేస్తోంది..!


నందమూరి తారక రామారావు బయోపిక్ షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని ఆఘమేఘాల మీద కానిచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్ బసవతారకం పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ తదుపరి షెడ్యూల్ కోసం సమాయత్తం అవుతుంది. అయితే ఈ లోపు దర్శకుడు క్రిష్, బాలకృష్ణలు ఎన్టీఆర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఒక చిన్న పాటి టూర్ వేశారు. అది కూడా అమరావతి టు నిమ్మకూరు. అమరావతిలో నిన్న శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుని భేటీ అయిన క్రిష్ అండ్ బాలకృష్ణలు.. చంద్రబాబు ఎన్టీఆర్ బయో పిక్ పై ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకుని ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లారు.

Advertisement
CJ Advs

నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను బాలకృష్ణ, క్రిష్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిమ్మకూరు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ మీడియా సమావేశంలో మట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ లో తాను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని... ఎన్టీఆర్ బయోపిక్ మొదటి షెడ్యూల్ కన్నుల పండుగగా.. సాగిందని.. బాలీవుడ్ నటి విద్యాబాలన్, బసవతారకం పాత్ర చేస్తున్నారని క్రిష్ చెప్పగా, బాలకృష్ణ తన తండ్రి పాత్రను తాను చెయ్యడం చాలా అదృష్టమని.. ఇక్కడ నిమ్మకూరులో ఎన్టీఆర్ బాలయ్య స్మృతులను, ఆయన చిన్ననాటి విషయాలను  గ్రామంలోని పెద్దలను అడిగి తెలుసుకుని వెళ్ళడానికి నిమ్మకూరు వచ్చినట్లుగా ఆయన చెప్పారు.

ఇక నిమ్మకూరులో ఎన్టీఆర్ కి సంబందించిన రెండు రోజుల షూటింగ్ జరుగుతుందని సమాచారం. సినిమాకు సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలను నిమ్మకూరులో రెండు మూడు రోజుల పాటు చిత్రీకరించేందుకు వచ్చారని తెలుస్తోంది. ఎన్టీఆర్ చిన్నప్పటి ఇల్లు, ఆయన తిరిగిన వీధులు తదితరాలను సినిమాలో కొంత చూపించాలన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ నిమ్మకూరుకు వచ్చిందనే టాక్ వినబడుతుంది.

NTR team Meets Chandrababu Naidu:

NTR team at NTR's Birth Place
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs