Advertisement
Google Ads BL

అజిత్‌ ఎంత గొప్పోడంటే..!


కోలీవుడ్‌లో రజనీకాంత్‌ తర్వాత అత్యంత ఎక్కువ ఫాలోయింగ్‌, క్రేజ్‌, ఇమేజ్‌ ఉన్న స్టార్స్‌ ఇద్దరు. వారే అజిత్‌, విజయ్‌. ఈ విషయంలో విజయ్‌ కంటే అజిత్‌ ఓ అడుగు ముందే ఉంటాడు. ఈయన నటించిన యావరేజ్‌ చిత్రాలు కూడా కాసుల వర్షం కురిపిస్తాయి. తెలుగులో పవన్‌కళ్యాణ్‌ తరహాలో తమిళంలో అజిత్‌ని పేర్కొనవచ్చు. 'వీరం, వేదాళం, వివేగమ్‌' చిత్రాలే దానికి ఉదాహరణ. ఇక ఈయన దర్శకుడు శివ దర్శకత్వంలో ఇప్పటికే హ్యాట్రిక్‌ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆయన మరోసారి శివ దర్శకత్వంలో 'విశ్వాసం' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. దీనిని దీపావళి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో ఇక దీని తర్వాత అజిత్‌ నటించే చిత్రం ఏమిటి? అనేది ఆయన అభిమానుల్లోనే కాదు.. సాధారణ తమిళ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Advertisement
CJ Advs

తాజా సమాచారం ప్రకారం ఆయన తన తదుపరి చిత్రాన్ని అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మాతగా చిత్రం చేయనున్నాడట. అజిత్‌కి శ్రీదేవి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. దాని వల్లే ఆయన శ్రీదేవి రీఎంట్రీ ఇచ్చిన 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రంలో అతిధి పాత్రను పోషించాడు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే శ్రీదేవి, బోనీకపూర్‌లు అజిత్‌ని తమ బేనర్‌లో ఓ చిత్రం చేయమని అడగటం, దానికి ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఇటీవల కార్తీ హీరోగా 'ఖాకీ' వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి తన సత్తాచాటుకున్న వినోద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. 'విశ్వాసం' చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

Ajith Next Film To Be Produced By Sridevi's Husband Boney Kapoor:

AJITH GOING TO TEAM UP WITH BONEY KAPOOR?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs