గతంలో అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగ సుశీల కొడుకు సుశాంత్ సినిమాలకు సుశాంత్ తల్లి నాగ సుశీల, ఆమెతో పాటుగా మాజీ ఆస్థాన నిర్మాత అయిన చింతలపూడి శ్రీనివాసరావులే ఉండేవారు. సుశాంత్ సినిమా ప్రమోషన్స్ కానివ్వండి ఎందులో అయినా సరే. కానీ ఈసారి సుశాంత్ తన సొంతంగా డెసిషన్ తీసుకుని రాహుల్ రవీంద్రన్ కి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. రాహుల్ కూడా తనకున్న అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని పరిమిత బడ్జెట్ లో చి.ల.సౌ సినిమాని తెరకెక్కించాడు. రాహుల్ సినిమా దర్శకుడిగా కొత్తవాడు కావడం, సుశాంత్ గత చిత్రాలు అన్ని ప్లాప్స్ అవడంతో.. అతనికి అసలు మార్కెట్ లేకపోవడంతో.. చి.ల.సౌ సినిమా బాగా వచ్చినప్పటికీ... దాని బిజినెస్ మాత్రం సరిగ్గా జరగలేదు. అలాంటి టైంలోనే అక్కినేని ఫ్యామిలీ నుండి సమంత ముందుగా రంగంలోకి దిగి స్వయానా చి.ల.సౌ సినిమాని వీక్షించింది. ఇక ఎలాగూ డబ్బింగ్ చెప్పే చిన్మయి భర్త రాహుల్ కూడా సమంతకి ఫ్రెండ్ కావడం, అలాగే అక్కినేని మనవడిని ఒడ్డున పడేసే బాధ్యతను తీసుకోవడమే కాదు... నాగ చైతన్యతో చి.ల.సౌ సినిమాని చూపించింది. ఇక భార్య భర్తలిద్దరూ సినిమా చూసి ఈ సినిమాని స్వయానా అన్నపూర్ణ బ్యానర్ నుండి విడుదల చేసే ఏర్పాట్లు మొదలు పెట్టారు.
కేవలం తామే కాకుండా నాగార్జున చేత కూడా ఈ సినిమాని చూపించి నాగార్జున సపోర్ట్ కూడా సుశాంత్ కి వచ్చేలా చేశారు. అయితే వీరంతా అంతగా ఈ సినిమాకి సపోర్ట్ చెయ్యడానికి కేవలం సుశాంత్ చుట్టమని, రాహుల్ ఫ్రెండ్ భర్త అని మాత్రమే కాదు... సినిమాలో విషయం ఉందని తెలిసి ఆ సినిమాని అక్కినేని ఫ్యామిలీ మొత్తం నిలబెట్టే ప్రయత్నం చేసింది. మరి నిజంగా అక్కినేని ఫ్యామిలీ నమ్మకాన్ని ప్రేక్షకులు నిలబెట్టారు. చి.ల.సౌ సినిమాని హిట్ చేశారు. కాస్త క్లాస్ టచ్ ఉన్నప్పటికీ.. మెల్లిగా పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే సత్తా వున్న కంటెంట్ తో ఉంది ఆ సినిమా. స్టోరీ లైన్ కొత్తగా ఉండడమే కాదు..డైరెక్షన్ స్కిల్స్ బావున్నాయి. అలాగే స్క్రీన్ ప్లే తో పాటుగా సుకుమార్ సినిమాటోగ్రఫి.. ఇలా అన్ని విషయాల్లో సినిమా మెప్పించింది. ఇక ఈ సినిమాకి మెయిన్ అంటే బలమున్న ఆకర్షణ హీరోయిన్ రుహనా శర్మ. రుహనా శర్మ నేచురల్ గా మేకప్ లేకుండా చాలా సహజ సిద్ధంగా నటించింది. అంజలి పాత్రలో తన సహజ సిద్దమైన నటనతో అక్కడక్కడా సుశాంత్ నే డామినేట్ చేసే లెవల్లో ఆమె నటన ఉంది. ఇక సుశాంత్ కూడా నటనతో.. లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇందుకే ఆ అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం సుశాంత్ చి.ల. సౌ కి దక్కింది.