రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ సినిమాని నిర్మాత డి వి వి దానయ్య తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే సినిమాగా బోయపాటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటిసారి రామ్ చరణ్ - భరత్ భామ కియారా అద్వానీ లు జంటగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్యలుగా పవర్ ఫుల్ పాత్రల్లో టాలీవుడ్ నటుడు ఆర్యన్ రాజేష్, తమిళ నటుడు ప్రశాంత్ లు నటిస్తున్నారనే టాక్ సినిమా మొదలైనప్పవుడే వినబడింది.
విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేమిటంటే ఆర్యన్ రాజేష్ ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ప్రత్యేకత కలిగిన మరో నెగెటివ్ రోల్ లో ఆర్యన్ రాజేశ్ స్టయిలిష్ గా కనబడతాడట. ఇక ఆర్యన్ పాత్రని బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడని అంటున్నారు. మరి సరైనోడు సినిమాలో హీరో ఆది పినిశెట్టిని బోయపాటి ప్రెజెంట్ చేసిన తీరు మంచి ప్రశంసలు అందుకుంది. నెగెటివ్ షేడ్స్ తో చాలా స్టైలిష్ లుక్స్ తో విలన్స్ ఇలా కూడా ఉంటారా అనిపించేలా ఉంటుంది ఆది పాత్ర.
మరి ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కూడా చాలాకాలం వెండితెరకు దూరమైన ఆర్యన్ రాజేష్ ని ఎలా చూపెడతాడో అనే విషయం మాత్రం అందరిలో ఆసక్తి కలగజేస్తుంది. ఈ సినిమాలో ఆర్యన్ పాత్ర అందరికి కనెక్ట్ అయితే.. మళ్ళీ ఆర్యన్ రాజేష్ సినిమాల్లో బిజీ అవ్వగలుగుతాడు.. లేదంటే యధా రాజా తథా ప్రజా!