Advertisement
Google Ads BL

ఈ అమ్మడు డ్రస్సింగ్‌ పిచ్చెక్కిస్తోంది..!


యువత ఎక్కువగా ఇష్టపడే వాటిల్లో జీన్స్‌కి ప్రత్యేకస్థానం ఉంది. మరీ ముఖ్యంగా డెనిమ్‌ జీన్స్‌ అంటే పడిచచ్చిపోయే వారు ఎందరో ఉన్నారు. చిన్నా, పెద్దా లేకుండా ఈ జీన్స్‌కి ఫిదా అయిపోతున్నారు. విదేశాల నుంచి మన దేశం వరకు అన్నిచోట్లా ఇదే పరిస్థితి. లేత నీలిరంగు డెనిమ్‌ జీన్స్‌ని వేసుకుంటే ఆటోమేటిగ్గా అందరి దృష్టి వారిపైనే పడుతుంది. అంతటి అయస్కాంత శక్తి దానికి ఉంది. ఇలా డెనిమ్‌ జీన్స్‌ ఒక అయస్కాంతం అయితే యువతను పిచ్చేక్కించడంలో తన పాటలు, నటనతో పిచ్చెక్కించే భామ జెన్నిఫర్‌ లోపేజ్‌ మరో అయస్కాంతం. అదే జెన్నిఫర్‌ లోపేజ్‌ డెనిమ్‌ జీన్స్‌ని వేసుకుంది అంటే డెనిమ్‌ అనే అయస్కాంతానికి జెన్నిఫర్‌ లోపేజ్‌ ఈమె క్రేజ్‌ తోడవుతుంది. 

Advertisement
CJ Advs

తాజాగా అదే జరగడంతో ప్రపంచవ్యాప్తంగా జెన్ని అంటే ప్రాణాలిచ్చేవారు పడి చచ్చిపోతున్నారు. ఈమెని ఇలా చూస్తే పసిపిల్లల నుంచి షష్టిపూర్తి చేసుకున్న వారి వరకు ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. తాజాగా జెన్నీ ధరించిన బూట్లు ఫ్యాషన్‌ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డెనిమ్‌ జీన్స్‌తో తయారు చేసిన బూట్లను ఆమె ధరించి దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అచ్చు జీన్స్‌ ప్యాంటుని పోలిన ఆ బూట్లు జెన్నిఫర్‌ మోకాళ్ల వరకు రాగా, వాటికి ఉన్న బెల్టు, పాకెట్లు చూడముచ్చటగా ఉన్నాయి. 

పైన తెల్లని చొక్కా, మోకాళ్ల వరకు డెనిమ్‌ జీన్స్‌ బూట్లను ఆమె ధరించి నడుస్తుంటే కెమెరాలన్నీ ఆమెవైపే క్లిక్‌క్లిక్‌ అనిపించాయి. ఇక ఈమె కంటే ముందే సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ కూడా ఇలాంటి బూట్లనే ధరించిన సంగతి తెలిసిందే. దీనిని బట్టి హాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఎంత ముందు ఉన్నారో అర్ధమవుతుంది...! 

Jennifer Lopez's Boots had Twitter Thinking her 'Pants are Falling':

Jennifer Lopez Just Wore a Shirt as a Dress and Jeans as Boots
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs