Advertisement
Google Ads BL

దిల్ రాజు మీకో నమస్కారం అంటున్నాడు..!


మొన్నామధ్యన హీరో నాని తో నిర్మాత దిల్ రాజు 'సభకు నమస్కారం' అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం నాని దేవదాస్ తో పాటుగా జెర్సీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండడమే కాదు మరోపక్క బుల్లితెరమీద కూడా బిగ్ బాస్ సీజన్ 2 అంటూ దున్నేస్తున్నాడు. అయితే అప్పటి నుండి 'సభకు నమస్కారం' మీద ఎటువంటి న్యూస్ రాలేదు. కానీ తాజాగా నా పేరు సూర్య సినిమా ప్లాప్ తో కాస్త తికమకలో ఉన్న అల్లు అర్జున్ తో దిల్ రాజుగారు ఈ సభకు నమస్కారం సినిమా చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ హల్చల్ చేశాయి.

Advertisement
CJ Advs

ఎలాగూ నా పేరు సూర్య తర్వాత ఇంతవరకు అల్లు అర్జున్ మరో సినిమాని ఇంకా అనౌన్స్ చెయ్యలేదు... విక్రమ్ తో సినిమా ఉంటుందో, లేదో అన్నట్లుగా ఉన్న కన్ఫ్యూజన్ టైం లో అల్లు అర్జున్ తో దిల్ రాజు సభకు నమస్కారం  సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు ప్రచారం జరిగాయి. అలాగే దిల్ రాజు, బన్నీలు సభకు నమస్కారం కథ కోసం డైరెక్టర్ ని సెట్ చేసే పనిలో ఉన్నట్లుగా చెప్పారు. మరి శ్రీనివాస కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్న దిల్ రాజు చెవికి చేరింది ఈ అల్లు అర్జున్ సభకు నమస్కారం వార్త. అయితే సభకు నమస్కారం సినిమాని అల్లు అర్జున్ తో చెయ్యడం లేదని.. అలాగే ప్రస్తుతం ఆ సినిమా కోసం మరే హీరోని అనుకోవడం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

అల్లు అర్జున్ తో సభకు నమస్కారం సినిమా న్యూస్ ఫేక్ న్యూస్ అని.. కేవలం నా బ్యానర్ లో ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలకు సిద్ధమవుతుందని... అలాగే ఇంకా తన బ్యానర్ లో మహేష్ 25 వ చిత్రంతో పాటుగా వరుణ్ తేజ్, వెంకటేష్ ల మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2 మాత్రమే తెరకెక్కుతున్నాయని.. మరే సినిమా తన బ్యానర్ లో చెయ్యడం లేదని చెప్పాడు. మరి ఇప్పుడు సభకు నమస్కారం కూడా బన్నీ చేయకపోతే మళ్ళీ ఆయన కొత్త చిత్ర ప్రకటన ఎప్పుడా అని ఎదురు చూడడం బన్నీ ఫ్యాన్స్ వంతైంది.

All Clears the Airs on Allu Arjun's Film:

Dil Raju Admits It a Fake News on Bunny <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs