Advertisement
Google Ads BL

'శ్రీనివాస కళ్యాణం' ట్రైలర్: పెళ్లంటే..ఇ..దే..రా!!


దిల్ రాజు కి కథ నచ్చింది అంటే ఆ సినిమా ఖర్చు విషయంలో అస్సలు వెనుకాడడు. అయన కథను నమ్మి సినిమాలు చేస్తాడు. మధ్య మధ్యలో కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా వేస్తుంటాడు అది వేరే విషయం. మాములుగా దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రత్యేకమైన ఆసక్తితో ఉంటారు ప్రేక్షకులు. ఇక రాబోయే శుక్రవారం దిల్ రాజు బ్యానర్ నుండి నితిన్ - రాశి ఖన్నా జంటగా కుటుంబ కథ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పోస్టర్ తోనే పిచ్చగా ఆకట్టుకున్న ఈ సినిమా.. పాటలు, టీజర్ అలాగే ప్రమోషన్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ కూడా విడుదలైంది. మరి ఆ ట్రైలర్ చూస్తుంటే బాగా డబ్బున్న పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ఈ  మధ్యన సాంఘీక మాధ్యమాల్లో ట్రైలర్స్ వదులుతున్నారు పెళ్లి ఫోటో గ్రాఫేర్స్. అంత రిచ్ గా అందమైన పెళ్లిలా కనబడుతుంది శ్రీనివాసుడి కళ్యాణం.

Advertisement
CJ Advs

జయసుధ వాయిస్ ని బ్యాగ్రౌండ్ లో పెట్టి వదిలిన ఈ ట్రైలర్ లో ఒక సంపన్నుడు పెళ్లి ఎలా ఉంటుందో అలా వుంది. జీవితంలో పండగలు చాలానే వస్తాయి. కానీ జీవితంలో పెళ్లి వేడుక మాత్రం ఒక్కసారే వస్తుంది... అని చెప్పినట్టుగా భారీ హంగులతో ఆ పెళ్లి పందిరి కళ కళలాడుతుంది. పెళ్లంటే చుట్టాలు పక్కాలు.. ఆత్మీయులు ఇలా ఆ సందడి తలుచుకుంటేనే మన ఇంట్లో పెళ్లి వేడుకలు గుర్తొచ్చేస్తున్నాయి. పెళ్లి కోసం చేసే పిండివంటల దగ్గరనుండి.. పెళ్లి పందిరి డెకరేషన్ వరకు, శుభలేఖలు దగ్గరనుండి.. వాటిని పంచేవరకు.. ఇక పెళ్లి కొడుకు తరుపు బంధువులను రిసీవ్ చేసుకోవడం.. వారికి మర్యాదలు చెయ్యడం.. పెళ్లి కొడుకుని ఆటపట్టించడం... అబ్బో ఇలాంటివి పెళ్లిల్లలో ఎంత కామనో శ్రీనివాస కళ్యాణం పెళ్లి వేడుకలో చూపించారు. ఇక నితిన్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్స్, రాశి ఖన్నా నాజూకు అందాలు... ఇలా ఆ శ్రీనివాసుడి కల్యాణానికి భారీ హంగులే సమకూరాయి. ఓవరాల్ గా ఈ శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ చూస్తుంటే మాత్రం నిజంగానే ఒక రిచ్ పెళ్లి ట్రైలర్ ని చూసినట్లుగా అనిపిస్తుంది.

ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, దర్శకుడి మేకింగ్ స్టయిల్, నిర్మాణ విలువలు మరి ఇవన్నీ సినిమాకి అదనపు ఆకర్షణలుగా అనిపిస్తున్నాయి. ఇక వచ్చే శుక్రవారం శ్రీనివాస కళ్యాణం సోలోగా బాక్సాఫీస్  బరిలోకి దిగబోతుంది. మరి ఈ సినిమా హిట్ అంటూ పక్కాగా సంకేతాలు కూడా సెన్సార్ వారు ఇచ్చేసారు. మరి గ్రాండ్ పెళ్ళికి క్లీన్ యూ అనే క్లిన్ సర్టిఫికెట్ ఇచ్చేసి సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేశారు.

Click Here for Trailer

Srinivasa kalyanam Trailer Report:

Super Star Mahesh Babu Launches Srinivasa Kalyanam Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs