తెలుగులో మొదటి చిత్రమే అందరు కలిసి నటించాలని కలలు కనే రాకుమారుడు మహేష్‌బాబు పక్కన హీరోయిన్‌గా చేసే చాన్స్ లభించింది. అంతేకాదు.. ఆ చిత్రం అద్భుతమైన విజయం కూడా సాధించింది. దాంతో ఆ వెంటనే ఆమెకి రామ్‌చరణ్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రంలో అవకాశం లభించింది. ఆమె ఎవరో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. ఆమె 'భరత్ అనే నేను' హీరోయిన్ కైరా అద్వానీ. స్వతహాగా ఈమె బాలీవుడ్ నటి అన్న విషయం తెలిసిందే. ఈమెకి చెందిన ఓ వార్త ఇప్పుడు బిటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఆమె యంగ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతోందిట. ఈయనేమైనా శ్రీరాముడి వంటి వాడా? అంటే అసలు కానే కాదు. ఈయన గతంలో అలియాభట్‌తో పాటు జాక్వెలిన్‌లతో కూడా ఎఫైర్లు నడిపాడు. నటునిగా స్టార్ ఇమేజ్ రాకపోయినా తన కంటే మంచి స్థాయిలో ఉన్న హీరోయిన్లను బుట్టలో పడేసిన శృంగార ప్రియుడుగా, ప్లేబోయ్‌గా, సరసుడిగా ఆయనకు పేరుంది. ఇక వీరిద్దరు ప్రేమలో ఉన్నారని బిటౌన్ మీడియా కోడైకూస్తోంది. దానికి తగ్గట్లుగా వీరిద్దరు కలిసి పలు ఫంక్షన్లకు హాజరవుతూ మీడియా కంటికి, కెమెరా కన్నుకి కూడా చిక్కుతుండటంతో ఇది నిజమేనని బాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఈమెకి ఉన్నాయని టాలీవుడ్ భావిస్తోంది.
మరి ఇదే సమయంలో ఈమె ప్రేమ దోమ అంటూ ప్రియుడితో కాలం గడుపుతూ తన కెరీర్‌ని నాశనం చేసుకుంటుదేమో అని కొందరు... మరి కొందరు ఆమె ప్లేబోయ్ అయిన సిద్దార్ద్ ఉచ్చులో ఎలా చిక్కుకుంది? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.