Advertisement
Google Ads BL

అందుకే ఆ చిత్రం నుంచి తప్పుకున్నా: త్రిష!


చెన్నై సుందరి, మిస్‌ చెన్నై అవార్డు గ్రహీత త్రిష ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా కనిపించే హీరోయిన్లలో ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈమె దక్షిణాదిలోని అన్ని భాషల్లో అందరు స్టార్స్‌తో నటించింది. కేవలం రజనీకాంత్‌తో మాత్రం నటించలేదు. రజనీకాంత్‌తో నటించడం, అమ్మ, పురచ్చితలైవి జయలలిత బయోపిక్‌లో ఆమె పాత్రను పోషించడం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌గా ఆమె చెప్పుకుంటుంది. ఆమె ఎంతో క్రమశిక్షణ కలిగిన నటి కాబట్టే ఇంతకాలం ఆమె హీరోయిన్‌గా సాగుతోంది. అలాంటిది ఆమె విక్రమ్‌ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న 'స్వామి స్క్వేర్‌' నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీనిపై కోలీవుడ్‌లో పెద్ద వివాదమే నడించింది. తమిళ నిర్మాతల సంఘం ఫిర్యాదుతో ఆమెపై బహిష్కరణ వేటు వేయాలని కూడా భావించారు. 

Advertisement
CJ Advs

ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, నాకు చారిత్రక చిత్రాలలో నటించాలని ఉంది. ఇక 'కోడి' చిత్రంతో చేసినటువంటి నెగటివ్‌ రోల్స్‌ కూడా చాలా ఇష్టం. ఇప్పటివరకు నటించిన చిత్రాలలో చేసినటువంటి పాత్రలను కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాలను చేయాలని ఉంది. ఇక నా నిశ్చితార్ధం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు నా దృష్టి అంతా సినిమాలపైనే. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను. స్వామి సీక్వెల్‌లో నా పాత్ర సరిగా లేదు. అందుకే తప్పుకున్నాను. చిత్రీకరణలో కూడా పాల్గొనలేదు. యునిసెఫ్‌ సర్వేలో మహిళలకు భద్రతలేని దేశాలలో భారత్‌ మొదటి స్థానంలో ఉండటం బాధించింది. దీనిపై అవగాహన ముఖ్యం. 20ఏళ్లకాలం నుంచి దేశం బాగా అభివృద్ది చెందింది. విద్యా ప్రమాణాలు పెరిగితేనే ఇలాంటివి తగ్గుతాయి. ఇన్నేళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతున్నానంటే కేవలం ప్రేక్షకులు, నిర్మాత, దర్శకుల ప్రోత్సాహమే కారణం. నా ఫిజక్‌ మా తల్లిదండ్రుల నుంచి జీన్స్‌పరంగా వచ్చింది. ఇష్టమైనవి తింటా. హాయిగా నిద్రపోతాను. ప్రత్యేకించి ఆరోగ్యంపై దృష్టిపెట్టను. 

ఇక ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో నా కెరీర్‌ మరికొన్నేళ్లు పెరుగుతుంది అని చెప్పుకొచ్చింది. ఇక స్వామి సీక్వెల్‌లో కీర్తిసురేష్‌ కూడా నటిస్తోంది. ఆమె పాత్ర పెద్దది కావడం, తనకు సినిమాలో పెద్ద గుర్తింపు లేకపోవడం వల్లనే త్రిష ఈ చిత్రం నుంచి వైదొలిగిందని కోలీవుడ్‌ మీడియా అంటోంది. 

Trisha Gives Clarity on Quitting Saamy Square:

Trisha Latest Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs