Advertisement
Google Ads BL

'శైలజా రెడ్డి అల్లుడు' అను కే అవసరం..!


ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ అను ఇమ్మాన్యువల్ పరిస్థితి ఏం బాగున్నట్టుగా లేదు. ఎందుకంటే అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ కాగా.. నా పేరు సూర్య ప్లాప్ అయ్యింది. మరి మెగా హీరోలిద్దరు అను ఇమ్మాన్యుయేల్ కి గట్టి షాక్ ఇచ్చారు. పాపం ఆ రెండు సినిమాలు హిట్ అయినట్లయితే రామ్ చరణ్ - బోయపాటి సినిమాకి కూడా అను నే హీరోయిన్ గా తీసుకునేవారు. అంతెందుకు త్రివిక్రమ్ అయితే ఎన్టీఆర్ కి అరవింద సమేత కోసం ఫిక్స్ అయ్యాడు. కానీ అజ్ఞాతవాసి దెబ్బకి తేడా కొట్టడంతో అను ని లైట్ తీసుకున్నారు. ఇక యంగ్ హీరో నాగ చైతన్య పక్కన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో హీరోయిన్ గా మారుతీ మరోసారి అను ఇమ్మాన్యుయేల్ కి ఆఫర్ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ.. నాగ చైతన్యకి అత్తగా...అను కి అమ్మగా కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ తోనే అను ఇమ్మాన్యువల్ కి హీరోయిన్ గా మనుగడ ఉంటుంది. మరి మంగళవారం రాత్రి విడుదల చేసిన శైలజా రెడ్డి అల్లుడు టీజర్ చూస్తుంటే అను ఇమ్మాన్యువల్ కి ఈ సినిమా హిట్ పక్కా అనిపిస్తుంది. డీసెంట్ రోల్ లో నాగ చైతన్య అను వెంటపడుతుంటే.. హాట్ హాట్ గా అను.. కాస్త పొగరుగా అన్ని తాను అనుకున్నట్టే జరగాలని ఫీల్ అవుతూ పొగరుబోతు అమ్మాయిగా... తాను చెప్పినట్టు పడుండే బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకోవడం... ఇక నాగ చైతన్య మాత్రం అమ్మడు అను వేషాలు చూసి చూసి పిల్లే ఇలా ఉంటే.. ఇక తల్లేలా ఉంటుందో అంటూ సరదాగా మాట్లాడడం.. ఇలా శైలజ రెడ్డి అల్లుడు టీజర్ అదిరింది.

మరి మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో అను ఇమ్మాన్యువల్ పక్కాగా హిట్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తుంది. హాట్ హాట్ శారీస్ లో అను కూడా హాట్ గా బాగానే కనబడుతుంది. ఇక రమ్యకృష్ణ శైలజా రెడ్డి పాత్ర ముందు కూతురు అను ఎలా హైలెట్ అవుతుందో అనేది ప్రస్తుతం ఉన్న అతిపెద్ద డౌట్. చూద్దాం అను ఫ్యూచర్ ని శైలజా రెడ్డి ఎలా డిసైడ్ చేస్తుంది అనేది మరో నెల రోజుల్లోనే తేలిపోతుంది.

Anu Emmanuel Hopes on Shailaja Reddy Alludu:

Shailaja Reddy Alludu Teaser Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs