Advertisement
Google Ads BL

సభకు నమస్కారం చెప్పేది అల్లు అర్జునేనా?


కృష్ణార్జున యుద్ధం పరాజయంతో నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి దేవదాసు అనే మల్టీస్టారర్ తో పాటుగా జెర్సీ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే  హీరో నాని వరుస హిట్స్ తో ఉండటంతో.. నిర్మాత దిల్ రాజు, నానితో వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. నిన్నుకోరి, ఎంసీఏ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన దిల్ రాజు.. నానితో మరో మూవీని నిర్మించడానికి రెడీ అయ్యాడు. 'సభకు నమస్కారం' అనే టైటిల్ తో నాని - దిల్ రాజు కాంబోలో మరో మూవీ తెరకెక్కనున్నట్లుగా వార్తలయితే మొన్నామధ్యన వచ్చాయి. అయితే దిల్ రాజు ఈసారి తన మనసు మార్చుకున్నాడట. ఈ సభకు నమస్కారం సినిమాని మరో స్టార్ హీరో తో చెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాడట.

Advertisement
CJ Advs

అది కూడా నా పేరు సూర్య సినిమా ప్లాప్ తో ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో ఉన్న అల్లు అర్జున్ తో దిల్ రాజు ఈ సభకు నమస్కారం సినిమా చెయ్యాలనే తలంపుతో ఉన్నాడట. ఎలాగూ విక్రమ్ కుమార్ తో సినిమా చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ప్రస్తుతం బన్నీ ఉన్నాడు . ఎందుకంటే ఈసారి మాస్ మసాలా ఎంటర్టైనర్ తో హిట్ కొట్టాలనే కసితో ఉన్న అల్లు అర్జున్ కి విక్రమ్ కుమార్ చెప్పిన కథ అంతగా ఎక్కలేదట. అందుకే విక్రమ్ కుమార్ తో బన్నీ ఒక మాస్ మసాలా ఉన్న కథను తయారు చెయ్యమని చెప్పాడట, మరి విక్రమ్ కుమార్ ఇంతవరకు అలాంటి మాస్ ఎలిమెంట్స్ తో పక్కాగా సినిమా చేసి హిట్ కొట్టలేదు. అందుకే విక్రమ్ తో సినిమాకి అల్లు అర్జున్ జంకుతున్నాడట.

ఇక ఈలోపు దిల్ రాజు, అల్లు అర్జున్ ని కలిసి సభకు నమస్కారం కథ వినిపించడంతో.. బన్నీ ఈ కథతో సానుకూలంగా ఉన్నాడంటున్నారు. కాకపోతే ఈ సభకు నమస్కారం కథని డైరెక్ట్ చేసే డైరెక్టర్ కోసం ఇప్పుడు కష్టాలు స్టార్ట్ అయ్యాయట. ఇప్పటికే దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ చాలామంది దర్శకుల పేర్లను పరిశీలించగా.. ఎవరు ఈ సభకు నమస్కారం సినిమా కథకు సరిపోయేలా అనిపించక.. ప్రస్తుతం దర్శకుడు కోసం బన్నీ అండ్ దిల్ రాజు వెయిట్ చేస్తున్నారట. మరి డైరెక్టర్ దొరకగానే దిల్ రాజు బ్యానర్లో అల్లు అర్జున్ సినిమా ప్రకటన పక్కా అనే మాట వినబడుతుంది. మరి అలా ఈ సినిమాకి నానిని తప్పించి బన్నీకి తగిలించారు.

Allu Arjun's New Film Sabhaku Namaskaram?:

<h1><span style="font-weight: normal;">Allu Arjun Says Sabhaku Namaskaram?</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs