Advertisement
Google Ads BL

వీడు.. పొగరుకే మొగుడురా..!!


'రోషగాడు' మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం 'రోషగాడు'. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మోషన్ పొస్టర్ ను బుధవారం విడుదల చేశారు. 

'వళ్లంతా పొగరురా 

పొగరుకే మొగుడురా

మొగుడురా పొగరుకే 

పడడు మాట రోషగాడు రా..' అంటూ భాష్యశ్రీ రాసిన పవర్ ఫుల్ థీమ్ లిరిక్ తో ఆద్యంతం ఆకట్టుకునేలా రోషగాడు మోషన్ పోస్టర్ వుంది. 

విజయ్ ఆంథోని సరసన నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా, నటుడు దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న 'రోషగాడు'  త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది‌. ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్యశ్రీ, సంగీతం: విజయ్ ఆంథోని, నిర్మాణం: విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని, కథ-దర్శకత్వం గణేష.

Roshagadu Movie Motion Poster Released:

Good Response to Vijay Anthony's new Film Roshagadu Motion Poster 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs