Advertisement
Google Ads BL

'అరవింద' కోసం సెంటిమెంట్ పక్కన పెట్టేశాడా!!


త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారి తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ జెట్ స్పీడు లో దూసుకుపోతుంది. ఇప్పటికే అరవింద సమేత షూటింగ్ దాదాపుగా మూడొంతులు పూర్తయిందని టాక్ వినబడుతుంది. గత ఏడాది నవంబర్ లో పూజా కార్యక్రమాలు చేపట్టిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు ఈ ఏడాది ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, ఈషా రెబ్బలు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా మెగా హీరో నాగబాబు నటిస్తుండగా.. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు ఒక గ్రామ సర్పంచ్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

ఇకపోతే త్రివిక్రమ్ తెరకెక్కించిన చాలా సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ హడావిడి ఉండేది. గతంలో హీరోయిన్స్ గా చేసిన మాజీ హీరోయిన్స్ ని తన సినిమాల్లో కీలకపాత్రను ఎంపిక చేసుకుని...వారిని ఆ సినిమాలో ప్రధాన ఆకర్షణగా చూపెడుతుంటాడు. అలా సీనియర్ నటీమణులను తీసుకున్న వాటిలో అత్తారింటికి దారేది సూపర్ హిట్ కాగా.. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ అయ్యింది. అత్తారింటికి దారేది లో నదియా ని మెయిన్ కేరెక్టర్ గా తీసుకున్న త్రివిక్రమ్ అజ్ఞాతవాసిలో తమిళ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ని తీసుకొచ్చాడు. మరి ఇపుడు అరవింద సమేత కోసం కూడా త్రివిక్రమ్ ఒక సీనియర్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్లుగా గట్టిగానే ప్రచారం జరిగింది.

మొదట్లో మీనా, రంభ పేర్లు బాగా వినబడ్డాయి. ఇక రంభ ఏకంగా అరవింద సమేత సెట్స్ మీదకెళుతుందన్న టైం లో ఆమె గర్భవతి అని తెలియడంతో ఆ ప్లేస్ లోకి మరో సీనియర్ హీరోయిన్ వేట మొదలైందన్నారు. మరి సినిమా మూడొంతుల షూటింగ్ పూర్తయినా ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్ విషయం తేలలేదు. అంటే అందరు అనుకుంటున్నట్లుగా అరవింద సమేతలో అసలు సీనియర్ హీరోయిన్ పాత్ర లేదా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే  ఇప్పటివరకు ఆ పాత్ర విషయంపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక సినిమా  షూటింగ్ మూడొంతులు పూర్తయ్యి మిగతా షూటింగ్ భాగం కూడా సెప్టెంబర్ 15 కి పూర్తికావాలని అరవింద సమేత టీమ్ డెడ్ లైన్ పెట్టుకుంది. మారాలెక్కన సీనియర్ హీరోయిన్ పాత్ర ఇక లేనట్లే ఫిక్స్ అవ్వాలా!

No Trivikram Sentiment in Aravinda Sametha Veera Raghava:

No Senior Heroine in Trivikram's Aravinda Sametha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs