Advertisement
Google Ads BL

ఆ హీరోతో గొడవలేం లేవ్: సాయి పల్లవి!


నిప్పులేనిదే పొగరాదు. అయితే సెలబ్రిటీలు మాత్రం అది నిజమైనా కాకపోయినా కూడా ప్రతి ఒక్కటి మీడియానే సృష్టించిందని తప్పంతా మీడియాపై తోసేస్తూ ఉంటారు. ఒకసారి ఒక వార్త తప్పుకావచ్చు. కానీ పదే పదే అవే వార్తలు వస్తూ ఉంటే మాత్రం కాస్త సందేహించాల్సిరావడం ఖాయం. ఈ విషయం 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవికి వర్తిస్తుంది. ఈమె 'కణం' చిత్రం షూటింగ్‌లో హీరో నాగశౌర్యని బాగా ఇబ్బంది పెట్టిందని వార్తలు వచ్చాయి. కానీ వాటిని సాయిపల్లవి మీడియా సృష్టించిన వదంతులుగా మొదట కొట్టివేసింది. కానీ ఆ తర్వాత నాగశౌర్యనే నేరుగా బహిరంగంగా ఈ విషయం ఒప్పుకుని సాయిపల్లవిపై మండిపడ్డాడు. 

Advertisement
CJ Advs

ఇక ఎంసీఏ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి)చిత్రం షూటింగ్‌లో ఈమెకి నేచురల్‌ స్టార్‌ నానితో కూడా విబేధాలు వచ్చాయని, షూటింగ్స్‌కి సరైన సమయానికి రాకుండా ఉండటంతో నాని ఆమెపై మండిపడ్డాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దీనిని నాని, సాయిపల్లవి ఇద్దరు ఖండించారు. ఇక ఇప్పుడు మరో యంగ్‌ హీరోతో సాయిపల్లవికి చెడిందని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం ఆమె శర్వానంద్‌ హీరోగా 'పడి పడి లేచె మనసు' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ కొంత భాగం పూర్తి కూడా చేసుకుంది. కానీ ఆ తర్వాత సాయిపల్లవితో ఏర్పడిన విబేధాల వల్లనే శర్వానంద్‌ ఈ చిత్రం షూటింగ్‌కి హాజరు కావడం లేదని అంటున్నారు. దీనిపై సాయిపల్లవి స్పందించింది. శర్వానంద్‌తో నేను గొడవ పడినట్లుగా, అందుకే షూటింగ్‌ ఆగిపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. శర్వానంద్‌ ఒకే సమయంలో ఈ చిత్రంతో పాటు మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నందు వల్లే ఈ చిత్రం షూటింగ్‌ ఆగింది... అని చెప్పుకొచ్చింది. 

ఇక్కడ గొడవ అంటే తిట్టుకోవడం, కొట్టుకోవడమే కానక్కర్లేదు. మనస్పర్ధలు, ఒకరి పద్దతులు మరోకరికి నచ్చకపోతే కూడా అది గొడవ కిందకే వస్తుంది. మరి సాయిపల్లవిపై వరుసగా ఇలాంటి వార్తలు వస్తూ ఉంటే అందులో కూడా నిజం ఉందేమో అని భావించే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా టాలెంట్‌ ఉన్న వారికి పొగరు కూడా ఉంటుంది. ఆ కోవలోకే సాయిపల్లవి వస్తోందా? ఈ పొగరును ఆమె ఆత్మవిశ్వాసం అని అనుకుంటోందా? అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. 

Sai Pallavi Clarifies On Her Clashes With Sharwanand:

No Clashes between me and Sharvanand, says Sai Pallavi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs