Advertisement
Google Ads BL

కాస్టింగ్‌కౌచ్‌పై నిహారిక ఇలా అంది!


అవకాశాల కోసం దేనికైనా సరే అనడం, ఆ తర్వాత వారు అలా చేశారు? ఇలా చేశారు? అని ఇండస్ట్రీ పరువుని తీయడం మంచి పని కాదనే చెప్పాలి. కానీ ఆడవారు చెప్పింది... పవర్‌లో ఉన్న వారి మీదికే తప్పంతా పోతుందనేది నిజం. తప్పు ఎవరిదైనా దోషిగా మాత్రం మగాడే మిగులుతాడు. ఇక విషయానికి వస్తే శ్రీరెడ్డి పుణ్యమా అని కాస్టింగ్‌కౌచ్‌ వివాదం టాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కి కూడా పాకి శ్రీరెడ్డి వార్తల్లో నిలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక కాస్టింగ్‌కౌచ్‌పై తాజాగా మెగాడాటర్‌ కొణిదెల నిహారిక స్పందించింది. కాస్టింగ్‌కౌచ్‌ అనేది సినిమా ఫీల్డ్‌లో మాత్రమే ఉందనేది తప్పు. ప్రతి రంగంలోనూ ఇలాంటివి ఉంటాయి. నేను కూడా ఇతర రంగాలలో వీటి గురించి పలు సంఘటనలు విని ఉన్నాను. ఎవరైనా ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుంది. ఆడవారి అంగీకారం లేకపోతే అది మానభంగం కిందకి వస్తుంది. ఏదైనా జరిగి పోయిన తర్వాత, తమ ఇష్టానుసారమే చేసిన తర్వాత అప్పుడు అది జరిగింది. ఫలానా వ్యక్తి అప్పుడు అలా చేశాడు.. అని ఆరోపించడం సబబుకాదు. నాకు ఇది తప్ప మరో దారిలేదు అనుకునే వారే దానికి సిద్దపడతారు. నేను వాళ్ల స్థానంలో ఉండి మాట్లాడలేను. ఎందుకంటే నా బ్యాగ్రౌండ్‌ వేరు. బయట నుంచి వచ్చిన అమ్మాయిలలా నేను మాట్లాడలేను అని స్పందించింది. 

నిజమే... నిహారిక చెప్పినట్లు ఇష్టం లేకపోయినా చేస్తే అది రేప్‌ కిందకే వస్తుంది. తమ అవసరం కోసం ఒప్పుకుని చేస్తే అది వారి తప్పే అవుతుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయనేది తెలిసిన విషయమే కదా...! ఈ విషయంలో మెగాడాటర్‌ బాగా చెప్పింది...!

Niharika About Casting Couch:

Niharika Konidela Reveals Truth Behind Casting Couch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs