Advertisement
Google Ads BL

కాస్టింగ్‌కౌచ్‌కి నో చెప్పినందుకు అవకాశాల్లేవ్!


అదితీరావు హైదరి, ఈమె ఎంతో గొప్ప సంస్థానాదీశుల ఇంట్లో జన్మించింది. ఈమె పుట్టి పెరిగింది హైదరాబాదే కావడం విశేషం. తన మొదటి చిత్రం 'శృంగారం'లో దేవదాసిగా, 'ప్రజాపతి'లో మమ్ముట్టి వంటి వారి సరసన నటించింది. ఇక బాలీవుడ్‌తో పాటు తమిళంలో క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'చెలియా' చిత్రంలో హీరోయిన్‌గా కార్తి సరసన నటించింది. ఇక తాజాగా ఆమె తెలుగులో మొట్టమొదటి సారిగా స్ట్రెయిట్‌ చిత్రం 'సమ్మోహనం'లో మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు సరసన నటించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో ఆమెకి తెలుగులో కూడా అవకాశాలు పెరిగాయి. తాజాగా అదితీరావు హైదరి కాస్టింగ్‌కౌచ్‌పై నోరు విప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Advertisement
CJ Advs

ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో నేను కుదురుకునేందుకు ఎన్నో కష్టాలు అనుభవించాల్సివచ్చింది. నేను కూడా కాస్టింగ్‌కౌచ్‌ బాధితురాలినే. చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను. అయితే వాటిని విజయవంతంగా అధిగమించాను. చిత్రపరిశ్రమలో అమ్మాయిలను ఎలా చూస్తారో చూసి ఏడ్చేదానిని. కాస్టింగ్‌కౌచ్‌కి నో చెప్పినందుకు కొన్నినెలలు సినిమాలే రాకుండా పోయాయి. ఆ సమయంలో నేను ఏడ్చేశాను. తీవ్రనిరాశకు, నిస్పృహకు లోనయ్యాను. నాతో కాస్టింగ్‌కౌచ్‌ గురించి మాట్లాడటానికి వారికెంత ధైర్యం? అని అనుకునే దానిని. ఎనిమిది నెలలు మేకప్‌ వేయకుండా ఖాళీగా ఉన్నాను. చేతిలో సినిమాలు లేకున్నా నేను తీసుకున్న నిర్ణయం నన్ను మరింత బలవంతురాలిని చేసింది. సినిమా ఫీల్డ్‌లో పవర్‌ప్లే నడుస్తూ ఉంటుంది. దాని వలలో అమ్మాయిలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. నిజంగా మనలో సత్తా, టాలెంట్‌ ఉంటే అవకాశాలు వాటికవే వస్తాయి... అని తెలియజేసింది. 

Aditi Rao Hydari opens up on her casting couch experience:

Aditi Rao Hydari on casting Couch Experience
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs