Advertisement
Google Ads BL

తాప్సీ ఆ పాత్రకు ఎర వేస్తోంది..!!


దక్షిణాదిలో పలు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస కాలేని హీరోయిన్‌ తాప్సిపన్ను. మొదటి చిత్రంతోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్రమైన 'ఝుమ్మందినాదం' చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ఈమెకి ఇక్కడ మంచి అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌కి వెళ్లి 'బేబి, పింక్‌, మేరా నామ్‌ షబానా, ఘాజీ' వంటి పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'జుడ్వా2' తో గ్లామర్‌కోణాన్ని కూడా ఆమె ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈమె పలు బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది. 

Advertisement
CJ Advs

తాజాగా ఈమె మాట్లాడుతూ, మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌పై తీయనున్నబయోపిక్‌లో నటించాలని తనకు కోరికగా ఉందని వెల్లడించింది. ఇప్పటికే మిథాలిరాజ్‌ బయోపిక్‌ని సినిమాగా తీయడానికి వయాకామ్‌ 18మోషన్స్‌ సంస్థ హక్కులు పొందింది. ఈ చిత్రంలో మిధాలీరాజ్‌ పాత్రను చేయడానికి పలువురు హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. 'మేరీకోమ్‌' వంటి చిత్రంలో నటించిన ప్రియాంకాచోప్రా, 'క్వీన్‌' కంగనారౌనత్‌లతో పాటు ఈ జాబితాలో తాజాగా తాప్సి కూడా చేరింది. క్రీడాకారుల బయోపిక్‌లో నటించాలని ఉంది. అది నా చిరకాల కోరిక.. అని తెలిపింది. ప్రస్తుతం తాప్సి మహిళా షార్ప్‌ షూటర్స్‌ జీవిత గాధల మీద అనురాగ్‌ కస్యప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉమానియా' చిత్రంలో నటిస్తోంది. 

ఇక తాజాగా విడుదలకు సిద్దమైన ముల్క్‌ చిత్రంపై కూడా ఆమె స్పందించింది. ఈ సినిమాలో ఎందుకు నటస్తున్నావని కొందరు నన్ను అడుగుతున్నారు. ఈ చిత్రంలోని పాత్ర నాకు చాలెంజ్‌ వంటిది. ఈ చిత్రం ఆగష్టు3న విడుదల కానుందని చెప్పుకొచ్చింది. ఇక మిథాలీరాజ్‌ బయోపిక్‌ కోసం ప్రియాంకాచోప్రా, కంగనారౌనత్‌, తాప్సిలు పోటీ పడుతున్నప్పటికీ మిథాలీరాజ్‌ మాత్రం తన పాత్రను ప్రియాంకచోప్రా చేస్తే బాగుంటుందని తన లైఫ్‌ స్టైల్‌కి ప్రియాంకాకి ఎంతో దగ్గరితనం ఉందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Taapsee Pannu would love to do Mithali Raj Biopic:

Taapsee Pannu Eager to do Mithali Raj biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs