Advertisement
Google Ads BL

ప్రియమణి చెప్పబోయే గుడ్ న్యూస్ అదేనా?


ప్రియమణి.. ఈమె దక్షిణాది చిత్రాలతో పాటు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రావణ్‌' అనే చిత్రంలో కూడా నటించింది. ఎన్టీఆర్‌తో 'యమదొంగ', బాలకృష్ణతో 'మిత్రుడు' వంటి చిత్రాలతో పాటు 'పెళ్లైన కొత్తలో, టాస్‌, నవవసంతం, హరేరామ్‌, కింగ్‌, ద్రోణ, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్‌, రగడ' వంటి పలు చిత్రాలలో నటించింది. తమిళంలో ఈమె నటించిన 'పరుత్తివీరన్‌' ద్వారా ఈమె ఉత్తమనటిగా జాతీయ అవార్డును సాధించింది. 

Advertisement
CJ Advs

ఇక ఆ తర్వాత ఆమె కవలల నేపధ్యంలో చేసిన 'చండీ, 'చారులత'లలో కూడా ఈమె తన నటనా ప్రతిభను చాటుకుంది. 'చెన్నైఎక్స్‌ప్రెస్‌, రక్తచరిత్ర2, రావణ్‌' వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె సినిమాలలో బిజీగా ఉండగానే ముస్తఫారాజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె భర్త ప్రముఖ ఈవెంట్‌ మేనేజర్‌గా మంచి స్థాయిలో ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినా బుల్లితెరపై మాత్రం కనిపిస్తూ ఉంది. తాజాగా ఆమె తన భర్తతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. 

అంతేకాదు.. త్వరలోనే ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతానంటూ ట్విస్ట్‌ ఇచ్చింది. అయితే ఈ ఫొటోని గమనిస్తే ఆమె గర్భవతిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె చెప్పబోయే ఆసక్తికర విషయం ఇదేనని స్పష్టంగా అర్ధమవుతోంది. దీంతో ప్రియమణి తల్లి కాబోతోందని నెటిజన్లు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

Priyamani is Pregnant?:

Priyamani is Expecting a Child and the News Would be Made Official Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs