Advertisement
Google Ads BL

అందుకే అనుష్కను అందరూ ఇష్టపడతారు!


ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి గురువు కేవలం కన్నతల్లి మాత్రమే. ఆ తర్వాతే తండ్రి, భర్త, దైవం, గురువు వంటివి వస్తాయి. ఇక ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో జీవితాంతం తల్లి పాత్ర ఎంతో గొప్పది. ఏది మంచి, ఏది చెడు? సమాజం ఎలా ఉంటుంది? వంటివన్నీ తల్లి ద్వారానే తెలుస్తాయి. వారికి సమాజంలో ఎలా నడవాలి? ఎలా ప్రవర్తించాలి? వంటి విషయాలతో పాటు నైతిక స్థైర్యం అందించి, వెన్నంటి ఉండే విషయంలో తల్లి పాత్ర ఎంతో గొప్పది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా స్వీటీ అనుష్క విషయానికి వస్తే 'అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి' వంటి చిత్రాల ద్వారా ఈమె తమిళంలో నయనతారలా తెలుగులో ఈమె పేరు స్దిరపడింది. విషయానికి వస్తే తాజాగా అనుష్క తల్లి జన్మదినం జరిగింది. ఈ సందర్బంగా ఆమె తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. తల్లి పక్కనే ఉండి తన కుటుంబసభ్యుల సమక్షంలో తన తల్లి చేత అనుష్క కేక్‌ని కట్‌ చేయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'నువ్వు నా పక్కన ఉంటేనా జీవితంలో నేను ఏదైనా సాధించగలను. హ్యాపీ బర్త్‌డే అమ్మా' అంటూ ట్వీట్‌ చేసింది. తనకు తల్లి పట్ల ఉన్న ప్రేమను, ఆమె తనకి ఇస్తోన్న ధైర్యాన్ని అనుష్క కేవలం ఒకే వాక్యంతో తెలియజేసింది. ఈ ట్వీట్‌తో అనుష్క తల్లి బర్త్‌డే గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక స్వీటీకి తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజ్‌ ఉంది. దాదాపు టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో టాప్‌స్టార్స్‌ అందరితో నటించిన స్వీటీ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిన 'వర్ణ, సైజ్‌జీరో' వంటి చిత్రాలతో కూడా తన ప్రతిభను చాటుకున్న విషయం తెలిసిందే. 

Anushka Shetty wishes her Mother on her Birthday:

Anushka wished her Mother with a Sweet Message
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs