Advertisement
Google Ads BL

సడెన్ గా ఈ హీరోయిన్ కి మహేష్ గుర్తొచ్చాడు!


బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి వచ్చిన సౌందర్యరాశి, సొట్టబుగ్గల సుందరి ప్రీతాజింటా ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. యువత తమకు కూడా ఆమెలాంటి ప్రేయసి, భార్యకావాలని కలలు కనే వారు. అలా డ్రీమ్‌గర్ల్‌గా పేరుతెచ్చుకున్న ఈమెని హీరోయిన్‌ని చేసింది ఎవరో కాదు..? దర్శకదిగ్గజం మణిరత్నం. ఆయన.. షారుఖ్‌ఖాన్‌ హీరోగా రూపొందించిన 'దిల్‌సే' చిత్రం ద్వారా ఈమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా నటించిన 'ప్రేమంటే ఇదేరా', ఆ తర్వాత ప్రిన్స్‌గా వెండితెరకు పరిచయం అయిన మహేష్‌బాబు మొదటి చిత్రం 'రాజకుమారుడు'లో కూడా ఈమె హీరోయిన్‌గా మెప్పించింది. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు వివాహం చేసుకుని పలు బిజినెస్‌లు చేస్తూ, తన భర్త వ్యాపారాలను చూసుకుంటున్న ఈమె 1999లో మహేష్‌ హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటించిన 'రాజకుమారుడు' చిత్రం నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుతుంది. ఈ మేరకు 'రాజకుమారుడు' చిత్రం సందర్భంగా తాను తీయించుకున్న ఫొటోని షేర్‌ చేసింది. మేమంతా సీరియస్‌గా ఓ ఫొటోని 1999లో దిగాం. 19 సంవత్సరాల కిందట ఈ ఫొటోని తీసుకున్నామని తెలిపింది. 

ఈ చిత్రంలో ప్రిన్స్‌ మహేష్‌బాబుతో పాటు ఆయన తండ్రి సూపర్‌స్టార్‌కృష్ణ, 'రాజకుమారుడు' నిర్మాత అశ్వనీదత్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి వారు ఉన్నారు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి సడన్‌గా ఈమెకి రెండు దశాబ్దాల కిందటి జ్ఞాపకం ఎందుకు గుర్తుకు వచ్చిందో మరి.

Preity Zinta shares a throwback picture with Mahesh Babu:

Mahesh Babu and Preity Zinta's Rajakumarudu movie Completes 19 Years
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs