Advertisement
Google Ads BL

శ్రీరెడ్డికి భలే ఛాన్సిచ్చాడు..!


కాస్టింగ్‌కౌచ్‌పై పోరాటం మొదలుపెట్టిన శ్రీరెడ్డి టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌కి చెందిన లారెన్స్‌తో మురుగదాస్‌ వంటి పలువురిని విమర్శించింది. వారంతా తనని అవకాశాల పేరుతో మోసం చేశారని వ్యాఖ్యానిండం కోలీవుడ్‌లో కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఇక కొరియోగ్రాఫర్‌, నటుడు, డ్యాన్సర్‌, దర్శకుడు అయిన రాఘవలారెన్స్‌కి తమిళనాటనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈయన అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తాడనే పేరు కూడా ఉంది. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి రాఘవలారెన్స్‌పై ఆరోపణలు చేయడం ఈ సంచలనానికి కారణమైంది. ఇక ఈమె తమిళనటుడు, నిర్మాత, దర్శకుడు వారాహిని టార్గెట్‌ చేయడం, దాంతో ఆయన శ్రీరెడ్డి ఓ వ్యభిచారి అని కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా శ్రీరెడ్డి చెన్నై పోలీస్‌ కమిషనర్‌కి ఫిర్యాదు ఇచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ఇంతకాలం నోరువిప్పని రాఘవలారెన్స్‌ శ్రీరెడ్డి ఆరోపణలు, విమర్శలపై స్పందించాడు. శ్రీరెడ్డి ఆరోపణల గురించి నన్ను అందరు అడుగుతున్నారు. అదేపనిగా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. దాంతో ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాను. శ్రీరెడ్డి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. నేను ప్రభాస్‌ నటించిన 'రెబెల్‌' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్పుడు వచ్చి కలిసింది. ఈ చిత్రం వచ్చి ఏడేళ్లు దాటింది. ఇంతకాలం ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆ సమయంలో నా రూమ్‌లో దేవుడి పటాలు, రుద్రాక్షలు ఉన్నాయని శ్రీరెడ్డి ఆరోపించింది. హోటల్‌ రూమ్‌లో అలాంటివి పెట్టుకోవడానికి నేనేమైనా పిచ్చాడినా? శ్రీరెడ్డి టాలెంట్‌ నిరూపించుకుంటే చాన్స్‌ ఇచ్చేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఆమె పరిస్థితి పట్ల బాధపడుతున్నానే గానీ భయపడటం లేదని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారాలన్నీ చూస్తే చాన్స్‌లు కావాలని శ్రీరెడ్డి వెళ్లి అడిగిన వారు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆమె ఇలా అసత్య ఆరోపణలు చేస్తోందని కూడా పలువురు భావిస్తున్నారు. 

Raghava Lawrence offers Sri Reddy a Chance:

Sri Reddy Tamil Leaks: Raghava Lawrence responds to Sri Reddy Allegations 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs