Advertisement
Google Ads BL

మహేష్ పూర్తి చేశాడు మరియు విసిరాడు!


మొన్నామధ్యన ఫిట్ నెస్ ఛాలెంజె ని విసురుకున్న చిన్న పెద్ద సెలబ్రిటీస్ ఇప్పుడు హరితహారానికి సంబంధించిన గ్రీన్ ఛాలెంజ్ అంటే మొక్కలు నాటే ఛాలెంజ్ ని విసురుకుంటున్నారు. ఎంపీ కల్వకుంట్ల కవిత మొక్కను నాటుతూ.. రాజమౌళి వంటి డైరెక్టర్ కి ఛాలెంజ్ విసరగా ఆయన తన ఫామ్ హౌస్ దగ్గర తోటలో మొక్కను నాటుతూ ఐటి మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరారు. మరసలే చాలా యాక్టీవ్ గా వుండే కేటీఆర్ మాత్రం ఎందుకూరుకుంటాడు. తాను రాజమౌళి ఛాలెంజ్ ని స్వీకరిస్తూ మొక్కలు నాటాడు. ఇక కేటీఆర్ కూడా క్రికెటర్స్ లక్షణ్, సచిన్, హీరో మహేష్ బాబు కి ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు. మరి కేటీఆర్ అలా సవాల్ విసిరారో లేదో ఇలా వి.వి. ఎస్ లక్షణ్ తో పాటుగా సచిన్ టెండూల్కర్ కూడా ఈ మొక్కలు నాటే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ఇక సైనా నెహ్వాల్ ఇలా చాలామంది సెలబ్రిటీస్ తమ వంతు గా మొక్కలను నాటారు. అయితే కేటీఆర్ సవాల్ కి హీరో మహేష్ బాబు చాలానే టైం తీసుకున్నాడు. మరి షూటింగ్ తో ఎక్కడో బిజీగా వున్న మహేష్ ని పట్టుకుని అందరూ కేటీఆర్ ఛాలెంజ్ కి మహేష్ కనీసం రిప్లై ఇవ్వడం లేదంటూ కామెంట్ చేశారు. అయితే మహేష్ మాత్రం లేట్ గా స్పందించినా లేటెస్ట్ గా తన కూతురు సితారాతో కలిసి ఈ గ్రీన్ ఛాలెంజ్ కోసం మొక్కలు నాటాడు. తన కూతురు క్యూట్ సితార, మహేష్ కలిసి నాటిన మొక్కను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

మహేష్, సితారలు  మొక్కను నాటుతూ దానికి నీళ్లు పోస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ అండ్ సితారలు నాటిన మొక్కేమిటో తెలుసా.. అది మామిడి మొక్కండి... మరి సితార పెరిగే సరికి అది కూడా పెరిగి బోలెడన్ని కాయలిచ్చేస్తుంది. ఇక మహేష్ అలా కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నానని చెప్పడమే కాదు తాను మొక్కను నాటుతూ...   తాను తన కూతురు సితారకు, కొడుకు గౌతమ్ కి అలాగే ప్రస్తుతం తన సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లికి గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు.

Mahesh Babu Accepted KTR's Green Challenge:

Mahesh Babu to respond to KTR challenge in style
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs