Advertisement
Google Ads BL

'సై రా' మరో హీరో రోల్ రివీలైంది..!!


మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సై రా సినిమా షూటింగ్ ఒక రేంజ్ లో పరిగెడుతుంది. మొన్నటివరకు నత్తనడక నడిచిన సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ హైదరాబాబ్ లో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఆంగ్లేయులతో సై రా నరసింహారెడ్డికి మధ్య జరిగే భారీ పోరాట సన్నివేశాలను కంప్లీట్ చేసుకున్న సై రా యూనిట్ ఇప్పుడు మరో భారీ షెడ్యూల్ కోసం విదేశాలకు పయనమవుతుంది. ఇక సై రా తర్వాత షెడ్యూల్ ను అబ్రాడ్ లో చెయ్యడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సై రా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, దర్శకుడు సురేంద్ర రెడ్డి లు కలిసి లొకేషన్స్ కోసం ఈ వారం యూరోప్ కు బయలు దేరనున్నారని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఆ షెడ్యూల్ లో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా జాయిన్ అవబోతున్నట్లుగా విజయ్ సేతుపతి చెబుతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమితాబ్ కి సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకుడు తాజాగా కన్నడ సుదీప్ సన్నివేశాలను చిత్రీకరించాడు. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి సై రా కోసం దిగబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఎవరి పాత్రలేమిటో ఆయా నటులు కొద్దీ కొద్దిగా రివీల్ చేసేసారు. అమితాబ్ సై రా గురువుగా... సుదీప్ ఆంగ్లేయుడిగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా సై రా సినిమా లో తన రోల్ ఏమిటో... రివీల్ చేసేశాడు.

ఇక ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి తమిళ్ యాసతో కూడిన పాత్ర చేస్తున్నాడట. అలాగే తమిళ యాసతో కూడిన పాత్ర అయినా... అక్కడక్కడా తెలుగు మాటలు కూడా పడతాయని చెప్పుకొచ్చాడు. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి తమిళం కి ఉన్న సంబంధం ఏమిటో క్లారిటీ లేదుగాని.. విజయ్ సేతుపతి మాత్రం సై రా సినిమాలో తమిళ్ తో కూడిన తెలుగు భాష మాట్లాడే ఒక ద్రవిడ రాజు పాత్రలో కనిపిస్తాడనేది స్పష్టమైంది. ఇక అబ్రాడ్ లో చెయ్యబోయే షెడ్యూల్ కూడా దాదాపుగా 30 రోజుల పాటు సుదీర్ఘంగా ఉంటుందని.. అయితే ఈ షెడ్యూల్ లో కూడా  హెవీ డ్యూటీ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను కూడా పాల్గొనబోతున్నారట.  

Sye Raa: Vijay Sethupathy Role Revealed:

<h3 class="text-center">Vijay Sethupathy Reveals His Role in Sye Raa</h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs