Advertisement
Google Ads BL

బిగ్‌బాస్‌లోకి మరలా 'ఆ..ఇద్దరు'...!


బిగ్‌బాస్‌ సీజన్‌2 లో పార్టిసిపెంట్స్‌ అయిన సామాన్యుడు నూతన్‌నాయుడు, యాంకర్‌, నటి శ్యామల మరలా రీఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తుదకు అదే నిజమైంది. ఇక సామాన్యునిగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నూతన్‌నాయుడు రెండో వారంలోనే ఎలిమినేట్‌ అయ్యాడు. కాగా హౌస్‌లోకి రీఎంట్రీ ప్రకటించిన తర్వాత వారం రోజులుగా ఓట్ల కోసం ప్రచారం జరిగింది. బిగ్‌బాస్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు వర్షం కురిసింది. నూతన్‌నాయుడుకి శ్యామల కన్నా కాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు బిగ్‌బాస్‌ నాని ప్రకటించాడు. ఇక వీరిద్దరి రీఎంట్రీ ఎపిసోడ్‌ శనివారమే షూట్‌ చేయడంతో ఇందులో ప్రేక్షకులుగా పాల్గొన్న వారి లీక్‌ల వల్లనే ఈ ఇద్దరు మరలా రీఎంట్రీ ఇస్తున్నారన్న విషయం బయటకు వచ్చింది. 

Advertisement
CJ Advs

తాను ప్రేక్షకుల వల్ల ఎలిమినేట్‌ కాలేదని, కేవలం హౌస్‌మేట్స్‌ రాజకీయాల వల్లే ఎలిమినేట్‌ అయ్యానని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో శ్యామల విజయం సాధించింది. ఇదే సమయంలో కౌశల్‌ ఆర్మీ నూతన్‌నాయుడుకి మద్దతుగా నిలిచింది. ఈ కారణాలతోనే మిగిలిన వారికంటే వీరిద్దరికి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా నాని హోస్ట్‌గా కూడా విఫలయ్యాడనే విమర్శలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌లా నిష్పక్షపాతంగా ఉండకుండా నాని కౌశల్‌కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. నానికి హౌస్‌లో జరుగుతున్న గొడవలపై సరైన క్లారిటీ ఉండటం లేదని అంటున్నారు. మరి నాని ఎలా ఈ విమర్శలకు చెక్‌ పెడతాడో వేచిచూడాల్సివుంది..! 

Bigg Boss 2, Big Conspiracy:

Bigg Boss 2: Shyamala, Nutan Naidu Re-Entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs