Advertisement
Google Ads BL

ఇంతకీ 'ఎన్టీఆర్‌'బడ్జెట్‌ ఎంత....?


బాలకృష్ణ తన సినిమాలలోని ఇతర ముఖ్యపాత్రలకు సరైన నటులు దొరికితేనే చిత్రాలు చేస్తాడు. లేదంటే ఆ సినిమానైనా ఒదులుకుంటాడు గానీ రాజీపడి ఎవరినో పెట్టుకోడు. తన స్వీయదర్శకత్వంలో 'నర్తనశాల'ని ప్రారంభించి సౌందర్యని ద్రౌపతిగా తీసుకున్నాడు. కానీ సౌందర్య హఠాన్మరణం వల్ల ఆ చిత్రాన్ని ఆపేశాడు. సౌందర్య తప్ప ఆ పాత్రను ఎవ్వరు చేయలేరని, అందుకే తాను ఆ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టానని పలుసార్లు చెప్పాడు. ఇక బాపు దర్శకత్వంలో ఈయన 'శ్రీరామరాజ్యం' చేసినప్పుడు కూడా సీతగా నయనతార ఒప్పుకోవడం వల్లే ఆ చిత్రం చేశానని, ఆమె నో అంటే ఇక ఆ ప్రాజెక్టే చేసేవాడిని కాదని అన్నాడు. అంతేందుకు ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' చిత్రం చేయాలని భావించి, అందులో కీలకపాత్రను అమితాబ్‌బచ్చన్‌ చేస్తేనే తాను నటిస్తానని చెప్పి, కృష్ణవంశీ అమితాబ్‌ని ఒప్పించలేకపోవడం వల్ల 'రైతు'ని పక్కనపెట్టాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చిత్రంలో తన తండ్రి పాత్రను తానే చేస్తూ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తన తల్లి, ఎన్టీఆర్‌ శ్రీమతి పాత్రకు ఏరికోరి అద్భుతమైన నటనాప్రతిభ వున్న విద్యాబాలన్‌ని ఎంపిక చేశాడు. ఇటీవల ఆమె ఈ చిత్రం షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కి వచ్చి సందర్భంగా ఆమెని తన ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానం చేశాడు. ఇక తాజాగా సమాచారం ప్రకారం కేవలం విద్యాబాలన్‌ని ఒప్పఇంచేందుకే ఆమెకి ఏకంగా ఒకటిన్నరకోటి పారితోషికం ఇవ్వడానికి బాలయ్య అంగీకరించాడట. మరీ ఆమెకి ఇంత భారీ పారితోషికమా? అని అందరు ఆశ్చర్యపోతున్నారు. మరి విద్యాబాలన్‌ రెమ్యూనరేషనే అంత అయితే అసలు 'ఎన్టీఆర్‌' బడ్జెట్‌ ఎంత అనేసందేహాలు కలుగుతున్నాయి.

NTR Biopic budget:

Shocking Budget for NTR Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs