Advertisement
Google Ads BL

ఇప్పుడు చెప్పండి.. పూజా గురించి సాక్ష్యం!!


ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో పెద్దగా పేరు తెచ్చుకోలేక బాలీవుడ్ కి చెక్కేసి.. మళ్ళీ టాలీవుడ్ కి ఎంటరైన పూజా హెగ్డే కి డీజే దువ్వాడ జగన్నాధ్ అదిరిపోయే బ్రేకిచ్చింది. అల్లు అర్జున్ పక్కన గ్లామర్ షో చేసినందుకు పూజా హెగ్డే కి అదృష్టం పట్టింది. ఆ సినిమాతో హరీష్ శంకర్ కి ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ దొరకలేదు. డీజే సీనిమా  తర్వాత అల్లు అర్జున్ నా పేరు సూర్య తో ప్లాప్ కొట్టాడు. ఇక దిల్ రాజు సినిమా ఒకటి హిట్ అయితే మరొకటి ఫట్ అవుతుంది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే కి మాత్రం ఎన్టీఆర్, మహేష్ లు పక్కన హీరోయిన్ ఆఫర్స్ వచ్చేశాయి. దెబ్బకి బిజీ హీరోయిన్ అయ్యింది. మధ్యలో భారీ పారితోషకానికి బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన సాక్ష్యం సినిమాలో నటించింది.

Advertisement
CJ Advs

కానీ సాక్ష్యం సినిమా గత శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో పూజా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఓకె ఓకె మార్కులే వేయించుకుంది. ఓ అన్నంత పేరు అయితే సాక్ష్యం సినిమాతో పూజా హెగ్డే తెచ్చుకోలేకపోయింది. ఇక సినిమా యావరేజ్ టాక్ కూడా పూజాకి మంచి చేయలేదు. అసలు సినిమాలోను భారీ తనం, బెల్లంకొండ సిక్స్ ప్యాక్ గురించి మట్లాడుకున్నట్టుగా పూజా హెగ్డే గురించిన డిస్కర్షన్స్ ఎక్కడా లేవు. అంటే సాక్ష్యం సినిమా ఆమెకు ఎలాంటి ప్లస్ కాలేదు. ఇక డీజే దువ్వాడ జగన్నాధం ప్లాప్ అన్నప్పటికీ. ఆ సినిమాలో పూజా చేసిన గ్లామర్ షో గురించి డీజే విడుదలై ఏడాది గడుస్తున్నా ఇంకా ముచ్చటిస్తున్నారు.

కానీ సాక్ష్యం సినిమాలో పూజా నటనపై ఎటువంటి కామెంట్స్ లేవు. ఇక గ్లామర్ షో కూడా అంతగా లేదుగాని.. ట్రెడిషనల్ డ్రెస్సులతో మాత్రం ఓకె అనిపించింది. ఇక పూజా గనక అరవింద సమేత సినిమాతో ఒకే అనిపించుకుంటే మరిన్ని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి. అరవింద సమేత టాక్ అటు ఇటు అయితే... పూజా పరిస్థితి ఆగమ్య గోచరమే. ఇక మహేష్ తో నటిస్తున్న సినిమా ఎలాగూ 2019 ఏప్రిల్ 5 వరకు విడుదల కాదు. ఇక ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పూజా ని ఫైనల్ చేస్తారో లేదో అనేది కూడా డౌట్. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాకి హీరోయిన్ ఎంపిక జరగలేదు. కేవలం వారి పరిశీలనలో పూజా పేరు వినిపించింది అంతే.

Pooja Hegde in Danger Zone:

Saakshyam No Help to Pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs