Advertisement
Google Ads BL

ఈ తండ్రీకొడుకులు కాస్త ఆలోచిస్తే బెటర్!


ఎవరైనా హీరోగా కాస్త నిలదొక్కుకున్నాక అతని మీద భారీ బడ్జెట్ పెడతారు. కానీ హీరోగా నిలదొక్కుకోవాలంటే భారీ బడ్జెట్ ఉండాలంటే కష్టమే. నితిన్ భారీగా పెట్టుబడి పెట్టి నాగార్జున కొడుకు అఖిల్ ని గ్రాండ్ గా అఖిల్ సినిమాని నిర్మించాడు. ఏమైంది అఖిల్ సినిమా కనీసం యావరేజ్ కూడా కాలేదు. ఇక నాగార్జున అఖిల్ రెండో సినిమాని చాల జాగ్రత్తగా మీడియం బడ్జెట్ పెట్టి తానే నిర్మాతగా హలో సినిమా చేశాడు. హలో సినిమా కాస్త యావరేజ్ అయ్యింది. ఇక టాలీవుడ్ నిర్మాతల్లో ఒకడైన బెల్లంకొండ సురేష్ తన కొడుకు ఒక్కసారే టాప్ హీరో అవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా తన కొడుకు శ్రీనివాస్ పనిచేసే నిర్మాతలతో డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టిస్తున్నాడు. మొదటి సినిమా అల్లుడు శీను నుండి ఇదే తరహా భారీ బడ్జెట్ బెల్లంకొండ శ్రీనివాస్ కోసం పెడుతున్నారు. ఇక నిర్మాతలు మధ్యలో చేతులెత్తేస్తే... స్వయంగా సురేష్ రంగంలోకి దిగి మరీ ఆ నిర్మాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. మరి అంత భారీ బడ్జెట్ పెడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఏమన్నా హీరోగా ఒక మెట్టు ఎక్కుతున్నాడా అంటే అదేమీ లేదు. అల్లుడు శీను దగ్గర నుండి నిన్న విడుదలైన సాక్ష్యం సినిమా వరకు మాస్ మాస్ అంటూ పక్కా కమర్షియల్ చిత్రాలనే ఎన్నుకుంటున్నాడు. మాస్ హీరో అనిపించుకోవాలంటే మంచి ఫిజిక్ ఉన్న బాడీ, నటన ఉంటే సరిపోదు.. పవర్ఫుల్ డైలాగ్స్ ని పవర్ఫుల్ గా చెప్పాలి. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ కి మెయిన్ మైనస్ డైలాగ్ డెలవరినే. పవర్ఫుల్ డైలాగ్ ని చెప్పాలంటే... అతని వాయిస్ లో అంత ఫోర్స్ ఉండదు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా పంచభూతాల కాన్సెప్ట్ ని తీసుకుని దర్శకుడు శ్రీవాస్ సాక్ష్యం సినిమాని అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో భారీగా తెరకెక్కించాడు. మరి ఈ సినిమాకి ట్రేడ్ లో ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ.. శ్రీవాస్ కథలోని లాజిక్ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులకు ఎక్కలేదు. కొన్ని సీన్స్ అయితే నాటకీయంగా ఉన్నాయని... అసలు సినిమా మొత్తం రొటీన్ రివెంజ్ డ్రామా అని కొట్టిపడేస్తున్నారు. ఇక సాక్ష్యం సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ జెట్ స్కీయింగ్, శాండ్ బోర్డింగ్, డిజర్ట్ బైకింగ్, నాలుగు చక్రాల ఆల్ టెరైన్ వెహికల్ రైడింగ్ లను కష్టపడి  నేర్చుకున్నాడు. మరి దుబాయ్ వంటి మహానగరంలో భారీ యాక్షన్ సీన్ చేసినా... బెల్లంకొండ శ్రీనివాస్ డమ్మీ లేకుండా ఓన్ గా యాక్షన్ సీన్స్ చేసినా సినిమాకి ఎటువంటి ఉపయోగమే లేదు.

ఇక సిక్స్ ప్యాక్ బాడీతో బెల్లంకొండ అలరించిన ఆ సిక్స్ ప్యాక్ సినిమాకి ఎటువంటి ప్లస్ అవలేదు. మరి బెల్లంకొండ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు సినిమాలు నిర్మిస్తే బావుంటుంది. కానీ సురేష్ చెప్పాడని... భారీగా ఖర్చు పెడితే.. ఇలానే ఉంటుంది. మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తూ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి గాని.. ఇలా హీరోయిన్స్ క్రేజ్ మీద, భారీ బడ్జెట్ మీద ఆధారపడితే లాభముండదు హీరోగారు అంటూ సెటైర్స్ వేస్తున్నారు సోషల్ మీడియాలో. మరి పైన చెప్పినవే కాదు బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడూ మాములు హీరోయిన్ తో రొమాన్స్ చెయ్యదు. కేవలం టాప్ హీరోయిన్స్ తో మాత్రమే జత కడతాడు. మరి హీరోయిన్ పారితోషకమే బడ్జెట్ లో ఎక్కువ ఫిగేర్ అనేలా ఉంటుంది బెల్లంకొండ హీరోయిన్స్ వ్యవహారం. మరి ఇప్పటికైనా బెల్లంకొండ తండ్రీకొడుకులు కాస్త ఆలోచిస్తే బెటర్. 

Poor Collections to Saakshyam at Box Office :

Bellamkonda Suresh and Srinivas.. What in Your Mind?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs