Advertisement
Google Ads BL

ఈ హీరో ఇక డైరెక్టర్ గానే స్థిరపడతాడేమో..!


'అందాల రాక్షసి' ద్వారా తెలుగు తెరకు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అనేక చిన్న చిత్రాలలో హీరోగా నటించాడు. కానీ హీరోగా ఆయన కెరీర్‌ పెద్దగా ముందుకు సాగలేదు. 'అలా ఎలా' తప్ప ప్రేక్షకులు మెచ్చుకున్న చిత్రం ఏదీ లేదు. దాంతో ఆయన మెగాఫోన్‌ని చేపట్టి మొదటిసారిగా కట్‌, ఓకే చెబుతున్నాడు. ఫ్లాప్‌ హీరోగా, అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్‌ హీరోగా 'చి.ల.సౌ' చిత్రం తీశాడు. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ చిత్రం థియేటికల్‌ ట్రైలర్‌ని అక్కినేని నాగార్జున విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌కి విశ్లేషకులు, విమర్శకులు, సాధారణ నెటిజన్లు, సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు3వ తేదీన విడుదలకు సిద్దం చేస్తున్నారు. లవ్‌, మ్యారేజ్‌ కంటెంట్‌తో ఈ ట్రైలర్‌ని కట్‌ చేశారు. దాంతో దీనికి వస్తున్న రెస్పాన్స్‌ని చూసి రాహుల్‌ రవీంద్రన్‌ ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఒక కొత్త దర్శకునికి ఇంత కంటే మంచి స్పందన ఎక్కడ వస్తుంది? ఏ కొత్త డైరెక్టర్‌కైనా ఇంతకంటే ఏమి కావాలి? అనే ప్రశంసలు లభిస్తుండటం పట్ల రాహుల్‌ రవీంద్రన్‌ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

మీడియాకు, ప్రేక్షకులకు, ఇండస్ట్రీ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశాడు. ట్రైలర్‌ లాగానే సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుందని నమ్మకంతో చెబుతున్నాడు. మరి సుశాంత్‌కి కాస్త హిట్‌ ఇచ్చి, దర్శకునిగా తనని తాను రాహుల్‌ రవీంద్రన్‌ నిరూపించుకుంటాడేమో వేచిచూడాల్సివుంది..! 

Rahul Ravindran Chi La Sow Trailer Got Good Response:

Rahul Ravindran big Hopes on Chi la Sow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs