Advertisement
Google Ads BL

శ్రీవాస్‌ ఎక్స్‌ట్రార్డినరీ సినిమా ఇచ్చారు..!!


బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్‌గా అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామ నిర్మించిన చిత్రం 'సాక్ష్యం'. ఈ నెల 27న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో.... 

Advertisement
CJ Advs

రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ - 'సినిమా చూసి ..తప్పు చేస్తే మనల్ని పంచభూతాలు గమనిస్తాయనే ఓ ఫీల్‌తో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. ఇంత పెద్ద సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేయడం అంత సులభం కాదు. శ్రీవాస్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా సినిమా చేశారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్డే సహా సినిమా కోసం పనిచేసిన అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. వారి బెస్ట్‌ ఎఫర్ట్‌ను అందించారు' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మాట్లాడుతూ - 'ఇంత మంచి సినిమాలో చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. శ్రీవాస్‌గారు ప్రతి సన్నివేశాన్ని వివరించి సంగీతం, నేపథ్య సంగీతం ఎలా కావాలో.. అలా రాబట్టుకున్నారు' అన్నారు. 

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ - 'అమేజింగ్‌ కాన్సెప్ట్‌. పంచభూతాలు అనే కాన్సెప్ట్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన శ్రీవాస్‌గారికి, ఆయనకు తోడ్పాటు అందించిన నిర్మాత అభిషేక్‌ గారికి.. సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా కంగ్రాట్స్‌. బెల్లకొండ సాయిశ్రీవాస్‌ చాలా కష్టపడి సినిమా చేశాడు. టీమ్‌ అందరం చాలా కష్టపడ్డాం కాబట్టే మంచి అవుట్‌పుట్‌ను రాబట్టుకోగలిగాం' అన్నారు. 

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ - 'కొత్త సబ్జెక్ట్‌ను నమ్మి సినిమా చేశాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌. ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. నా టీమ్‌లో ప్రతి ఒక్కరి కష్టం వల్ల సినిమాను అద్భుతంగా తీయగలిగాను. తప్పు చేస్తే ప్రకృతి మనల్ని చూస్తుంటుంది అనే భావన అందరిలో కలగాలనే చేసిన మా ప్రయత్నం ఈ రోజు సక్సెస్‌ అయింది. అది సినిమా సక్సెస్‌తో నిరూపణ అయింది. మన అందరిలో ఉండే దైవత్వ భావన ఇలాంటి సినిమాలను చూసి ఆదరిస్తున్నప్పుడు బయటకు తెలుస్తుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరో నలుగురికి సినిమా బావుందని చెబుతున్నారు. శ్రీనివాస్‌ ప్రాణం పెట్టి సినిమా చేశారు. పంచభూతాలు అనే కాన్సెప్ట్‌కు పీటర్‌ హెయిన్స్‌గారు అద్భుతంగా యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేశారు. అలాగే ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.ఎస్‌.ప్రకాశ్‌గారు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌గారు ఇలా అందరూ తమ బెస్ట్‌ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాను చూసి మహిళా ప్రేక్షకులు అభినందిస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్‌ సినిమా చూసి అప్రిషియేట్‌ చేస్తూ ఫోన్స్‌ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరం లేని సన్నివేశాలు లేకుండా చాలా మంచి విలువలతో చేసిన సినిమా. ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే ఇంకా కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఆలోచిస్తాను. నేనే కాదు.. అందరూ కొత్త కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు' అన్నారు. 

నిర్మాత అభిషేక్‌ నామ మాట్లాడుతూ - 'డైరెక్టర్‌గారు నాకు ఏదైతే కథను చెప్పారో.. అదే కథను అందంగా తీశారు. టీమ్‌ అందరూ 150 రోజుల పాటు పడ్డ కష్టం. కలెక్షన్స్‌ రోజురోజుకీ పెరుగుతున్నాయి. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌' అన్నారు. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ - 'మంచి సినిమాలను విజయవంతం చేస్తామని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారు. సాక్ష్యం మా అందరి కష్టమని గర్వంగా చెప్పుకుంటాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. సాయిమాధవ్‌గారి డైలాగ్స్‌, పీటర్‌ హెయిన్స్‌గారి యాక్షన్‌, హర్షవర్ధన్‌గారి సంగీతంతో పాటు అభిషేక్‌గారి అన్‌ కాంప్రమైజ్‌డ్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ సినిమా సక్సెస్‌లో కీలకంగా మారాయి. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్‌' అన్నారు. 

Saakshyam Success Meet Details:

Saakshyam Success Meet Highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs