Advertisement
Google Ads BL

'శివకాశీపురం' ఆ ఫంక్షన్‌ కూడా పూర్తయ్యింది!


ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ మాస్టర్‌ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'శివకాశీపురం'. హరీష్‌ వట్టికూటిని దర్శకుడుగా పరిచయం చేస్తూ మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 3న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను నిర్వహించింది. ప్రముఖ నిర్మాతలు కె.వి.వి.సత్యనారాయణ, రాజ్‌ కందుకూరి, రుద్రరాజు పద్మరాజు, నల్లమోతు శ్రీధర్‌ అతిథులుగా విచ్చేసి చిత్రంలోని పాటలను, ట్రైలర్‌ను, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రాజేష్‌ శ్రీ చక్రవర్తి, హీరోయిన్‌ ప్రియాంక శర్మ, చిత్ర నిర్మాత పులిమామిడి మోహన్‌బాబు, దర్శకుడు హరీష్‌ వట్టికూటి, ఈ చిత్రం విడుదలను పర్యవేక్షిస్తున్న వి.ఎస్‌.విజయ్‌వర్మ పాకలపాటి, సంగీత దర్శకుడు పవన్‌ శేషా, సినిమాటోగ్రాఫర్‌ జయ జి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ.. 'శివకాశీపురం అనే టైటిల్‌ నాకు బాగా నచ్చింది. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ చూశాను. చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. 'నేను ఈ ఫంక్షన్‌కి రావడానికి ముఖ్య కారణం, ఈ సినిమా హీరో రాజేష్‌... సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు కావడం. ఆయన పేరులో తాత పేరు, తండ్రి పేరు కూడా చేర్చుకున్నాడు. ట్రైలర్‌ చాలా బాగుంది. రాజేష్‌ చక్కని నటన ప్రదర్శించాడు. ఈ చిత్ర నిర్మాత ఒక రైతు, దర్శకుడు ఒక టీచర్‌. వీరిద్దరూ కలిసి మా చక్రవర్తిగారి అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా మంచి భవిష్యత్తు వుంటుందని, వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. 

రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో చిన్న సినిమాలు విడుదల కావడం చాలా కష్టంగా మారింది. అయినా ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని ఎంతో తపన పడ్డారని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందించాలని మిత్రుడు విజయ్‌వర్మ ఈ సినిమాను విడుదల చేసే బాధ్యతను తీసుకున్నాడు. చాలా సంతోషం. ఈ చిత్రం విజయాన్ని కాంక్షిస్తూ ఎంతో మంది మిత్రులు ఇక్కడికి వచ్చారు. 'శివకాశీపురం' తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు. 

నిర్మాత మోహన్‌బాబు పులిమామిడి మాట్లాడుతూ.. 'ఒక మంచి కథతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. డైరెక్టర్‌ హరీష్‌ చాలా చక్కగా ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా బాగా రావడం కోసం యూనిట్‌లోని అందరూ ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆగస్ట్‌ 3న మా 'శివకాశీపురం' చిత్రం మీ ముందుకు వస్తోంది. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు. 

దర్శకుడు హరీష్‌ వట్టికూటి మాట్లాడుతూ.. 'నేను ఈ వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా నిర్మాత మోహన్‌బాబుగారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన సపోర్ట్‌ నాకు ఉంది. నేను చిన్న చిన్న తప్పులు ఏమైనా చేసినా ఏరోజూ నన్ను ఒక్కమాట కూడా అనలేదు. ఒక మంచి చిత్రం చేయడానికి నిర్మాత ఎలాంటి సహకారం అందించాలన్నది మోహన్‌బాబు గారిని చూసి తెలుసుకోవాలి. ఈరోజుల్లో సినిమా చేయడం వేరు, దాన్ని రిలీజ్‌ చేయడం వేరు. ఆ బాధ్యతను తీసుకున్న విజయ్‌వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అన్నారు. 

వి.ఎస్‌.విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ.. 'నటుడు, మిత్రుడు దిల్‌ రమేష్‌ సూచన మేరకు ఈ సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. దీన్ని తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాలన్న పట్టుదలతో కృషి చేస్తున్నాను. 50 థియేటర్లకు తక్కువ కాకుండా రెండు రాష్ట్రాల్లో విడుదల చెయ్యాలనుకుంటున్నాం. ఇప్పటికే నైజాంలో 14 థియేటర్లు కన్‌ఫర్మ్‌ అయిపోయాయి. ఇదే స్పీడుతో వెళితే తప్పకుండా 100 థియేటర్లలో సినిమా రిలీజ్‌ చేస్తామన్న నమ్మకం ఏర్పడింది. 'శివకాశీపురం' చిత్రం ప్రేక్షకులకు ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది' అన్నారు. 

హీరో రాజేష్‌ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ.. 'నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో దర్శకనిర్మాతలు ఈ సినిమా ద్వారా నన్ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హరీష్‌గారు ఒక డిఫరెంట్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మోహన్‌బాబుగారు ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ సినిమాని నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది' అన్నారు. 

హీరోయిన్‌ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విలేజ్‌ గర్ల్‌గా ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమా నాకు మంచి బ్రేక్‌నిస్తుందని నమ్ముతున్నాను' అన్నారు. 

రాజేష్‌ శ్రీచక్రవర్తి, ప్రియాంకశర్మ, చమ్మక్‌ చంద్ర, దిల్‌ రమేష్‌, సూర్య, లక్ష్మీ, రవిఆనంద్‌, చిన్నిబిల్లి, సందీప్‌, రవీంద్ర నటరాజ్‌, సత్యప్రియ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. 

ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ శేషా, కెమెరా: జయ జి. రామిరెడ్డి, ఎడిటింగ్‌: జియో థామస్‌-టి.రాము, విడుదల పర్యవేక్షణ: విఎస్‌. విజయ్‌వర్మ పాకలపాటి, నిర్మాత: మోహన్‌బాబు పులిమామిడి, రచన, దర్శకత్వం: హరీష్‌ వట్టికూటి. 

Sivakasipuram Pre Release Function Details:

Sivakasipuram Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs