Advertisement
Google Ads BL

రాజ్ తరుణ్ కు బ్రేక్ ఎందుకు?


ఒకప్పుడు నిర్మాతల పాలిట ఒక వరంలా కనబడిన రాజ్ తరుణ్ ఇప్పుడు నిర్మాతలు పారిపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒకే ఒక్క ఏడాదిలో మూడు సినిమాల డిజాస్టర్స్ రాజ్ తరుణ్ నుండి వచ్చాయి. రంగుల రాట్నం, రాజుగాడు, లవర్ మూడు సినిమాలు రాజ్ తరుణ్ కి డిజాస్టర్ ప్లాప్స్ ఇచ్చాయి. మూడు సినిమాలు వరసగా ఒకేసారి డిజాస్టర్స్ అయ్యేసరికి రాజ్ తరుణ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దెబ్బకి హీరోగారి దిమ్మతిరిగింది. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు కూడా లవర్ సినిమాని నిర్మించినప్పటికీ... రాజ్ తరుణ్ కి హిట్ ఇవ్వలేకపోయాడు. అందుకే ఆ సినిమా పోతుందని ముందే తెలిసిన దిల్ రాజు ఆ సినిమా విషయంలో చాలాలైట్ తీసుకున్నాడు.

Advertisement
CJ Advs

ఇక లవర్ సినిమా తర్వాత రాజ్ తరుణ్ తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నాడు. తనకి మంచి అవకాశాలు రావాలని మొక్కుకున్నాడో లేదో తెలియదు గాని.. ప్రస్తుతం రాజ్ తరుణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే ఆగిపోయిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుమారి 21 ఎఫ్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కాల్సివుంది. కుమారి దర్శకుడు సూర్య ప్ర‌తాప్ హీరో రాజ్ త‌రుణ్‌కి ఆల్రెడీ క‌థ చెప్ప‌డం... ఓకే చేయించడం జరిగాయి. ఇక ఈ కాంబో పక్కాగా ఓకే అయ్యింది అన్న తరుణంలోనే లవర్ సినిమా ప్లాప్ అయ్యింది. ల‌వ‌ర్‌ త‌ర‌వాత మొద‌ల‌వ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింద‌ని స‌మాచారం. 

ఇలా ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణం ఒకటి రాజ్ త‌రుణ్‌కి ఎదుర‌వుతున్న వ‌రుస ఫ్లాపులు... ఇక మరో కారణం సూర్య ప్ర‌తాప్ కి మ‌రో మంచి ఆఫ‌ర్ రావ‌డం అంటున్నారు. కాకపోతే రాజ్ తరుణ్ తో సినిమా చేసి చేతులు కాల్చుకోవడం అవసరమా అనిపించిన దర్శకుడు వేరే ఆఫర్ పట్టాడనే టాక్ వినబడుతుంది. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ ని చూస్తుంటే ఈ హీరో పరిస్థితి ఇలా తయారైందేమిటి అనిపిస్తుంది. మరి ఒకప్పుడు చెలరేగిపోయి సినిమాలు చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు అవకాశాలు లేక అల్లాడుతున్నారు. అయితే రాజ్ తరుణ్ ఈ బ్రేక్ లో కాస్త విశ్రాంతి తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

Since these are bad times for Raj Tarun:

Raj Tarun Next Movie Stopped
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs