Advertisement
Google Ads BL

రేణుదేశాయ్‌ ఎంట్రీ.. నటిగా కాదు!


తెలుగులో రేణుదేశాయ్‌కి నటిగా మంచి ఫాలోయింగ్‌ ఉంది. పవన్‌కళ్యాణ్‌ని వివాహం చేసుకోకముందు ఆమె నటిగా తెలుగులో నటించింది. ఆ తర్వాత నటిగా పరిశ్రమకి దూరం అయింది. పవన్‌తో విడిపోయిన తర్వాత ఆమె మరాఠీ చిత్రాలపై దృష్టి పెట్టింది. కానీ నటిగా కాకుండా దర్శకనిర్మాతగా మారి మరాఠీలో చిత్ర నిర్మాణం చేస్తోంది. ఇక ఈమె త్వరలో తెలుగులోకి నటిగా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిపై తాజాగా రేణుదేశాయ్‌ స్పందించింది. 

Advertisement
CJ Advs

ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. తెలుగులోకి నేను ఎంట్రీ ఇస్తున్న మాట నిజమే. అయితే నటిగా కాదు. దర్శకనిర్మాతగా తెలుగులో ఓ చిత్రం చేయనున్నాను. ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే పూర్తయ్యాయి. ప్రస్తుతం డైలాగ్స్‌ సమకూరుస్తున్నాను. ఈ చిత్రం సంక్రాంతికి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నానని చెప్పుకొచ్చింది. జనవరి నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో నేను నటించను. కేవలం దర్శకురాలిగా మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేసింది. 

మరి రేణుదేశాయ్‌ దర్శకత్వం వహించే చిత్రం విషయంలో మెగాభిమానుల ఆదరణ ఎలా ఉంటుందో మాత్రం వేచిచూడాల్సివుంది...! ఇక త్వరలోనే రేణుదేశాయ్‌ రెండో వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమెకి నిశ్చితార్ధం జరిగింది. మరి రేణుదేశాయ్‌ దర్శకత్వం వహించే చిత్రంలో పవన్‌ తనయుడు అకిరా ఏదైనా పాత్ర చేస్తాడా? లేదా? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది. 

Clarity on Renu Desai Re Entry:

Renu Desai Gives Clarity On Rumours About Re Entry 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs